సీమాంధ్రలో చెదురుమదురు వర్షాలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాలంటే నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే తెలంగాణలో అక్కడక్కడా ఉరుములుతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అనంతపురం, కర్ణాటకలోని బళ్లారి, చెన్నై నగారాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.