visakhapatnam meteorological department
-
కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. పలు చోట్ల వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ మధ్య కర్ణాటక మీదుగా విస్తరించి ఉంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వానలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 40 మి.మీ, మచిలీపట్నంలో 24, కొవ్వూరులో 23, చంద్రగిరిలో 20, అల్లవరంలో 10, మామిడికుదురులో 9 మి.మీ. వర్షపాతం నమోదైంది. (చదవండి: డైవర్షన్ డ్యాం పవర్‌గేట్‌లో సాంకేతిక లోపం) -
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం: కోస్తా తీరం వెంబడి తక్కువ ఎత్తులో ఉత్తర గాలులు వీస్తుండడం.. వీటికి అనుబంధంగా రాయలసీమ మీదుగా వీస్తున్న ఈశాన్య గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. రానున్న 10 రోజుల పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 3–5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా విజయనగరం, విశాఖ, రాయలసీమలోని పశ్చిమ ప్రాంతాల్లో 10 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించారు. చలి గాలులకు తోడు మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఉదయం 9 గంటల వరకూ రోడ్లపైకి ప్రజలు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక విశాఖ మన్యంలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లిలో 5.8 డిగ్రీలు, అరకు లోయలో 9.6, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండ్రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక తీరాల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించారు. గడచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లా బి.నిడమానూరులో అత్యధికంగా 275 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. చింతవరంలో 57, వై.రామవరంలో 54.5, నూజివీడులో 32.5, పెదబయలులో 31.5 మి.మీ. నమోదైంది. (చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం) -
నేడు, రేపు విస్తారంగా వానలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తమిళనాడు, శ్రీలంక తీరాలకు సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీరం వెంబడి తూర్పు–పడమర గాలుల కలయిక (షియర్ జోన్) కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్లు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. -
Weather Report Today: నేడు, రేపు మోస్తరు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ద్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం వల్ల రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ద్రోణి కొనసాగుతోంది. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ అండ్ సిక్కిం నుంచి, దక్షిణ ఒడిశా తీర ప్రాంతం వరకు వ్యాపించి, సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్లు ఎత్తున ఉంది. నైరుతి బంగాళాఖాతం దగ్గర ఉన్న ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్లు నుంచి 3.6 కిలోమీటర్ల మధ్య ఉంది. ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, మంగళవారం విశాఖలో 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. -
రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా వ్యాపిస్తోంది. ఇది మరట్వాడా, ఉత్తర కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం వరకు వ్యాపించి ఉందని, దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖలోని వాతావరణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలతోపాటు రాయలసీమలోని పలు చోట్ల వర్షాలు కురిసే వీలుందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని పాములపాడు, కొత్తపల్లి, జూపాడుబంగ్లా, ఓర్వకల్లు, మిడుతూరు మండలాల్లో శనివారం అకాల వర్షాలు పడ్డాయి. నందికొట్కూరు మండలం నాగటూరులో పిడుగుపాటుతో ఓ మహిళ మృతిచెందింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజవొమ్మంగి మండలంలోని తంటికొండ గ్రామ సమీపాన ఈదురుగాలులతో కురిసిన వర్షానికి భారీ వృక్షం కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. -
మొదలైన చలి ప్రభావం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన వేళ.. ఈశాన్య గాలుల ప్రభావం రాష్ట్రంలో మొదలైంది. పలుచోట్ల చలి ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత మొదలైంది. ఆరోగ్యవరంలో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 కి.మీ. ఎత్తు వద్ద నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతోంది. అదేవిధంగా తూర్పు బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాల్లో 1.5 కి.మీ. నుంచి 4.5 కి.మీ. మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
కోస్తాలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలుల వల్ల రుతుపవనాలు కోస్తాంధ్రతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోకి వచ్చాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. ఉత్తర తమిళనాడు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 3.1 కి.మీ వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
రేపు తెలుగు రాష్ట్రాల నుంచి ‘నైరుతి’ నిష్క్రమణం
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు సోమవారం నిష్క్రమించనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహరాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కింతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాలుగు రోజుల్లో దేశం నుంచి నైరుతి నిష్క్రమణ పూర్తికానుందని పేర్కొంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో 1.5 నుంచి 3.1 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
అల్పపీడనాలే ఆదుకున్నాయ్!
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో అల్పపీడనాలే ఆదుకున్నాయి. సీజన్ ఆరంభమైనప్పట్నుంచి ముగిసే వరకు బంగాళాఖాతంలో ఐదు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఒక్క వాయుగుండంగానీ, తుఫాన్గానీ ఏర్పడకుండానే సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జూన్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ ఆఖరు వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కనీసం రెండు వాయుగుండాలుగానీ, ఒకట్రెండు తుఫాన్లుగానీ వస్తుంటాయి. కానీ ఈసారి అలా జరగలేదు. అల్పపీడనాలే పుష్కలంగా వర్షాలు కురిపించి రైతులకు, రాష్ట్రానికి మేలు చేశాయి. వీటితో పాటు ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ద్రోణులు వంటివి మరో 12 వరకూ ఏర్పడ్డాయి. ఇవి కూడా రాష్ట్రంలో వర్షాలకు దోహదపడ్డాయి. కోస్తా కంటే సీమలోనే అత్యధిక వర్షపాతం సబ్ డివిజన్‌వారీగా చూస్తే కోస్తాంధ్ర కంటే ఈ సారి రాయలసీమలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అక్కడ 411.6 మి.మీల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 756.1 మి.మీల వర్షం కురిసింది. సీమలో అత్యధికంగా కడప జిల్లాలో 401.3 మి.మీలకు గాను 843.6 మి.మీలు నమోదైంది. ఇక కోస్తాంధ్ర (యానాంతో కలిపి)సబ్‌డివిజన్‌లో సాధారణ వర్షపాతం 586.9 మి.మీ కాగా, 725.3 మి.మీల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా మినహా.. రాష్ట్రంలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే లోటు వర్షపాతం నమోదైంది. అక్కడ 742.4 మి.మీలకు 558.5 మి.మీల వర్షపాతమే రికార్డయింది. నెలలవారీగా చూస్తే జూలైలో అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టులో స్వల్పంగానే వానలు పడా ్డయి. జూన్‌లో 32 శాతం, జులైలో 74 శాతం, ఆగస్టులో 6 శాతం, సెప్టెంబర్‌లో 58 శాతం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. పొంగుతున్న వాగులు, వంకలు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యా ప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, ఓర్వకల్లు మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పాపాఘ్ని నది ఉప్పొంగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో గరిష్టంగా 76.8 మి.మీ. వర్షం కురిసింది.విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అనంతపురం, జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలతో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు పలుచోట్ల కోతకు గురైంది. ఇక్కడి జియోట్యూబ్ రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమైంది. కృష్ణమ్మకు మళ్లీ వరద ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 38,516 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. రాత్రి 7 గంటలకు రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి మొత్తం 56,058 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 215.8070 టీఎంసీల నీరు నిల్వగా ఉండగా, డ్యామ్ నీటిమట్టం 885 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంలోకి ఆదివారం దాదాపు 52 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ముందు జాగ్రత్తగా 16 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. -
నేడు మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/చిలకలపూడి (మచిలీపట్నం): ఈశాన్య బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోందని విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ విభాగం– అమరావతి తెలిపాయి. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమం వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. బుధ, గురువారాల్లో రాష్ట్రమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ► కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంగళవారం 3.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గూడూరు మండలంలో 17.0 మిల్లీమీటర్లు, అత్యల్పంగా చాట్రాయి మండలంలో 1.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. ► అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. గుంటూరు నగరంలో కురిసిన వర్షాలకు డ్రెయిన్లు పొంగి పొర్లాయి. ► తడి వాతావరణం ఉండటంతో పశ్చిమ డెల్టా ప్రాంతంలో వెద పద్ధతిలో వరి పంట సాగులో జాప్యం జరుగుతోంది. ► పత్తి పొలాలు ఉరకెత్తడంతో కొన్నిచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. -
నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలోని వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ విభాగం వెల్లడించింది. సోమవారం ఉత్తరకోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. అల్పపీడనం కారణంగా కోస్తా తీరం వెంబడి సోమ, మంగళవారాల్లో బలమైన గాలులు వీచే సూచనలున్నాయి. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. -
నేడు, రేపు కోస్తాంధ్రలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: అల్పపీడన ప్రభావంతో గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ► ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ► కోస్తా తీరం వెంట గంటకు 50 నుంచి 60 కి.మీ వేగం గాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. రెండు రోజులపాటు కోస్తా తీర ప్రాంత మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ► గత 24 గంటల్లో వర రామచంద్రాపురంలో 6 సెం.మీ, పోలవరం, పాడేరుల్లో 5, ప్రత్తిపాడు, పెద్దాపురంల్లో 4, చింతపల్లి, కుక్కునూరు, అమలాపురం, తాడేపల్లిగూడెం, కూనవరం, భీమడోలుల్లో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
3 రోజులు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/ కాకినాడ సిటీ/కర్నూలు: నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై చురుగ్గా కొనసాగుతోంది. అదేవిధంగా తూర్పు పశ్చిమ షియర్ జోన్ 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ.ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.18, 19, 20 తేదీల్లో ఉత్తర కోస్తా, యానాం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ► గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని కోయిలకుంట్ల, పాకాల, డోర్నిపాడులో 4 సెం.మీ., గజపతినగరం, నల్లమల, రుద్రవరం, చెన్న కొత్తపల్లి, కలక్కడలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ► తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం 4.9 మి.మీ. సరాసరితో మొత్తం 312.4 మి.మీ. వర్షపాతం నమోదయింది. అత్యధికంగా అమలాపురం మండలంలో 22.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లాలో 19 మండలాల్లో వర్షాలు కురిశాయి. కోవెలకుంట్లలో అత్యధికంగా 39.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ నెలలో ఇప్పటికే 12 శాతం అధిక వర్షపాతం నమోదైంది. -
తెలుగు రాష్ట్రాలలో చెదురుమదురు వర్షాలు
విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఇది ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరంపై కొనసాగుతుందని పేర్కొంది. అలాగే ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు పడతాయని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కరుస్తాయని చెప్పింది. అయితే కోస్తాంధ్రలో కొన్నిచోట్ల మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. -
కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు
విశాఖపట్నం : కోస్తాంధ్రకు వర్ష సూచన ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ... ఉత్తర కోస్తా తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. అది 3 నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఆ ఆవర్తనం ఆవరించి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని... రేపటి నుంచి క్రమంగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది. -
తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు
విశాఖపట్నం: విదర్భ నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా... దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అలాగే విదర్భ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
విశాఖపట్నం : విదర్భ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌పై అల్పపీడనం కొనసాగుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడతాయని... దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. అలాగే తెలంగాణలోనూ వర్షాలు పడతాయని కానీ కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. -
రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
విశాఖపట్నం: ఉత్తర కోస్తా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు అనుకుని తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రాంతంలో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తా, తెలంగాణలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 -50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు
-
కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది ఉత్తర కోస్తా తీరానికి అనుకుని కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురస్తాయని తెలిపింది. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 -50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. దీంతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు
విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది పశ్చిమ బెంగాల్లో తీరాన్ని అనుకుని కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం మరింత బలపడి ఒడిశావైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఛత్తీస్గడ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని చెప్పింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. కోస్తా తీరం వెంబడి 45 -50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తీరాలను ఈ అల్పపీడనం ఆనుకుని ఉందని తెలిపింది. అలాగే అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఒడిశా, కోస్తాంధ్ర మీదగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని.... కోస్తా తీరం వెంబడి గంటకు 45 - 50 కి.మీ. వేగంలో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
48 గంటల్లో మరింత బలపడనున్న అల్పపీడనం!
విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు... అలాగే తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
ద్రోణి ప్రభావంతో సీమాంధ్రలో భారీ వర్షాలు
విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. సోమవారంలోగా అది వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
తెలంగాణ, కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు
విశాఖపట్నం : విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా... దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే రాయలసీమలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
రాగల 48 గంటల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. రాగల 48 గంటల్లో తెలంగాణలో వర్షాలు విస్తారంగా పడతాయని తెలిపింది. కోస్తాంధ్రలో మాత్రం అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. -
తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు!
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. నేడు ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. అలాగే తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు!
-
కొనసాగుతున్న అల్పపీడన ఆవర్తనం
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయిని చెప్పింది. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. -
కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు!
-
కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు!
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడే అవకావం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. -
తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు: వాతావరణ కేంద్రం
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీంతో తెలంగాణలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని పేర్కొంది. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. -
రాగల 48 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు!
విశాఖపట్నం : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. ఇది కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుందని తెలిపింది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రాగల 48 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. -
రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!
విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా ద. తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమ, కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు పడతాయని పేర్కొంది. రాగల 48 గంటల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతవారణ కేంద్రం తెలిపింది. -
ఉత్తర తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు
విశాఖపట్నం : ఉత్తర తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. రాగల 24 గంటల్లో తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. అలాగే అల్పపీడన ప్రాంతంలోఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం, బుధవారం ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. కోస్తాతీరం వెంబడి 45 -50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. -
కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు
విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు పడతాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. చేపల వేటకు వెళ్లే మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని వాతావరణ కేంద్రం చెప్పింది. -
రాగల 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు
విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. రాగల 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. -
ఉత్తరకోస్తాకు వర్ష సూచన
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
మూడు రోజుల్లో కోస్తాంధ్రలో అతిభారీ వర్షాలు
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. -
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : ఒడిశా, ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదగా అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సదరు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే కొన్ని చోట్ల మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని చెప్పింది. అలాగే దక్షిణ కోస్తాతీరం వెంబడి 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతానికి అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలపై అల్పపీడనం కేంద్రీకృతమైందని పేర్కొంది. అల్పపీడనానికి ఆనుకుని 5.8 మీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది. అలాగే తెలంగాణలో నేటి నుంచి మరింత విస్తారంగా వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని వాతావరణ కేంద్రం సూచించింది. -
కోస్తాంధ్రకు భారీ వర్షాలు !
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు, కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు విస్తాయని పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
కోస్తాంధ్రలో వర్షాలు !
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది నేడో రేపో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు... ఉత్తర కోస్తాలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు విస్తాయని చెప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
సీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం!
విశాఖపట్నం : పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలను ఉపరితల ఆవర్తనం ఆనుకుని ఉందని పేర్కొంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
మందకొడిగా నైరుతి రుతుపవనాలు
విశాఖపట్నం : నైరుతి రుతుపవనాలు మందకొడిగా ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద రుతుపవనాలు నిలకడగా ఉన్నాయని పేర్కొంది. ప్రతికూల వాతావరణంతోనే రుతుపవనాల్లో కదలిక లేదని స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, తెలంగాణలో ఈ రుతుపవనాలు విస్తరించడానికి మరో 2 లేదా 3 రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపింది. 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో క్యూములోనింబస్ మేఘాలు ప్రభావంతో వర్షాలు పడతాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు !
విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చు అని పేర్కొంది. క్యుములోనింబస్ మేఘాల వల్ల సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వర్షం పడుతుందని తెలిపింది. మిగిలిన సమయంలో ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పింది. రుతుపవనాలు వచ్చే నెల ఏడవ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. -
గంటకు 20 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాన్
విశాఖపట్నం : కళింగపట్నానికి 150 కి.మీ దూరంలో... గోపాలపట్నానికి 50 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఈ తుపాన్ గంటకు 20 కి.మీ వేగంతో కదులుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని సూచించింది. ఉత్తర కోస్తాలోని అన్ని పోర్టుల్లో 4వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొంది. ఇచ్చాపురంలో 15, కళింగపట్నంలో 14 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. -
'ఈ రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశం'
విశాఖపట్నం : మచిలీపట్నానికి 80 కి.మీ దూరంలో... విశాఖకు ఆగ్నేయంగా 290 కి.మీ దూరంలో... కాకినాడకు 160 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని పేర్కొంది. ఈ రోజు రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. 21 రాత్రి లేదా 22 తెల్లవారుజామున ఈ తుపాన్ బంగ్లాదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. -
సీమాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం
విశాఖపట్నం : బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఇది చెన్నైకి నైరుతి దిశగా 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం వివరించింది. రాగాల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. -
బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం
విశాఖపట్నం : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం - శ్రీలంక తీరం మధ్య అల్పపీడనం కేంద్రీకృతమైందని తెలిపింది. రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. వాయువ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం తాంబన్ - నాగపట్నం మధ్య తీరాన్ని వాయుగుండం దాటనుందని వివరించింది. -
తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు
విశాఖపట్నం : విదర్భ నుంచి కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో అయితే అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొందని .కోస్తాంధ్రలో ఈ రోజు కూడా సాధారణం కంటే 1 లేదా 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం చెప్పింది. -
మరో 4 రోజుల పాటు వర్షాలు
విశాఖపట్నం : విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితలం ఆవర్తనం ఏర్పడి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగురోజులపాటు వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గత రెండు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతోంటే... మిగతా జిల్లాల్లోనూ పలుచోట్ల అకాల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. -
మరో రెండు రోజులు తీవ్ర వడగాలులు: వాతావరణ శాఖ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని పేర్కొంది. మరో రెండు రోజులు తీవ్ర వడగాలులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ ఎండలు నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. -
గాలి రూటు మార్చింది
రెండ్రోజుల పాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 10 డిగ్రీలు అధికం తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం విశాఖపట్నం: వాతావరణంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్నాళ్ల నుంచి వీస్తున్న తూర్పు, ఈశాన్య గాలులు అనూహ్యంగా దిశ మార్చుకున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు మళ్లీ ఊపందుకున్నాయి. కొద్ది రోజులుగా బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ం, ద్రోణుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. అవి బలహీనపడడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. అదే సమయంలో విదర్భ, ఛత్తీస్గఢ్లపై ఏర్పడ్డ అధిక పీడనం వల్ల శీతలంతో కూడిన వాయవ్య గాలులు వీయడంతో అటు ఉత్తర తెలంగాణ, ఇటు ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు క్షీణించి చలి ప్రభావం చూపింది. ఇంతలో ఇప్పుడు దక్షిణ, ఆగ్నేయ దిశగా వీస్తున్న గాలులు వాయువ్య గాలులను అడ్డుకోవడంతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అందువల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తెలంగాణలో 6 నుంచి 10 డిగ్రీలు, ఆంధ్రప్రదేశ్‌లో 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తెలంగాణలో 5 నుంచి 6, ఆంధ్రప్రదేశ్‌లో 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా రికార్డవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణలోని రామగుండంలో 24 (+10), నిజామాబాద్‌లో 23 (+10), హైదరాబాద్‌లో 21 (+6) నమోదయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో 23 (+6), బాపట్ల 24 (+5), ఒంగోలు 25 (+4), మచిలీపట్నంలో 24 (+4) డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే తెలంగాణలోని నిజామాబాద్‌లో 35 డిగ్రీలు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం 34 (+5), కర్నూలులో 34 (+4) డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రెండు రోజులే.. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల మరో రెండు రోజుల పాటే ఉంటుందని, ఆ తర్వాత క్షీణిస్తాయని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. విదర్భ, చత్తీస్‌గఢ్‌ల నుంచి వస్తున్న చల్లని వాయవ్య గాలులను దక్షిణ, ఆగ్నేయ గాలులు అడ్డుకోవడం వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుదలకు కారణమని ఆయన వివరించారు. తేలికపాటి జల్లులకు అవకాశం మరోవైపు వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. గడచిన 24 గంటల్లో ఇరు రాష్ట్రాల్లో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. -
అల్పపీడనంగా మారిన ద్రోణి
విశాఖపట్నం : నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. అల్పపీడన ప్రాంతంలో 4.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాలో చెదురుమదురు వర్షాలు పడతాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది. -
కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం : తమిళనాడు తీరానికి సమీపంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. తమిళనాడు ప్రాంతంలో 3.5 కిలోమీటర్ల మేర ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని... అలాగే ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉత్తర దిశగా గాలులు వీస్తాయని పేర్కొంది. ఉత్తరకోస్తాలో చెదురుమదురు వర్షాలు పడతాయని చెప్పింది. అయితే దక్షిణ కోస్తాలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ద్రోణి ప్రాంతంలో 3.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. దక్షిణా కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. తమిళనాడులోనూ విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. -
బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. అల్పపీడన ద్రోణి మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమలో ఆదివారం, సోమవారం విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు
విశాఖపట్నం : .పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం 2.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని విశాఖపట్నంలో వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంఓ దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయని చెప్పింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 - 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాని హెచ్చరించింది. -
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం
విశాఖపట్నం : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరిత అవర్తనం ఏర్పడిందని తెలిపింది. మరో 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే రాగల 24 గంటల్లో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. -
నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : తమిళనాడు తీరం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా.... ఉత్తర బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కోస్తా తీరం వెంబడి 45 - 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఈశాన్య రుతుపవనాల ప్రభావం బలంగా ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే కోస్తా తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. అయితే శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం
విశాఖపట్నం : ఉత్తరబంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. లక్షాద్వీప్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాన, కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈరోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. -
దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు !
విశాఖపట్నం : ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను అనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అలాగే ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణకోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి ఆవరించి ఉందని పేర్కొంది.ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరకోస్తాలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. -
కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే 5.8 కి. మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అల్పపీడన ప్రాంతం ఏపీ తీరానికి సమీపంలో ఉండటంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. తెలంగాణలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. -
కోస్తాంధ్రలో వర్షాలు... ఈదురుగాలులు
విశాఖపట్నం : మధ్య భారతంపై తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. అలాగే అల్పపీడన ద్రోణి కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుందని తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 - 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
అల్పపీడనం మరింత బలపడే అవకాశం
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిలకడగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. అయితే అల్పపీడన ప్రాంతంలోనే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. అలాగే ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. -
రేపటి నుంచి కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. అది రెండు రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కోస్తాంధ్రలో చెదురుమదురుగా... రేపటి నుంచి మాత్రం విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. -
రాగల 24 గంటల్లో కోసాంధ్రలో వర్షాలు
విశాఖపట్నం : మరో రెండు లేదా మూడు రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. అలాగే ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. -
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు !
విశాఖపట్నం : పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం విశాఖపట్నంలో వెల్లడించింది. అలాగే ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలను అనుకొని ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. -
24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు
విశాఖపట్నం : 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని తెలిపింది. రుతుపవనాల వల్ల రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. -
రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు
విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్రా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. అలాగే ఒడిశా పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. -
కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు
విశాఖపట్నం: తూర్పు మధ్యప్రదేశ్ - ఉత్తరప్రదేశ్ మధ్య వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. కాగా ఈ వాయుగుండం తెలుగు రాష్ట్రాలపై వాయుగుండ ప్రభావం ఉండదని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. -
పూరీకి 150 కి.మీ దూరంలో వాయుగుండం
విశాఖపట్నం: పూరీకి దక్షిణ దిశగా 150 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. గోపాల్పూర్ - పూరీ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ కోస్తా వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కోస్తా ప్రాంతాల్లో మరో రెండురోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది. అయితే ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం ఓడరేవుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. కృష్ణపట్నం, నిజాపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు ఉన్నతాధికారులు హెచ్చరించారు. -
మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం: మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర అనుకోని అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని పేర్కొంది. అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కుదులుతుందని చెప్పింది. దీంతొ కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు
-
తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు
విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు పడతాయని తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ 95 శాతం మేర నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం: ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ..దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్సపీడన ద్రోణి ఏర్పడినట్టు విశాఖలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ప్రస్తుతం కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్ర్రాలలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు చోట్లు భారీ వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. -
సీమాంధ్రలో చెదురుమదురు వర్షాలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాలంటే నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే తెలంగాణలో అక్కడక్కడా ఉరుములుతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అనంతపురం, కర్ణాటకలోని బళ్లారి, చెన్నై నగారాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
సీమాంధ్రను తాకనున్న నైరుతి రుతుపవనాలు
విశాఖపట్నం : కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు సోమవారం తాకనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. విదర్భ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు తీరం వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తం ఏర్పడిందని పేర్కొంది. ఈ రెండింటి ప్రభావం వల్ల కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. -
కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
విశాఖపట్నం: రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ఈ రోజు ఉదయం 9.35 గంటలకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని వెల్లడించింది. రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు !
విశాఖపట్నం: జార్ఖండ్ నుంచి ఒడిశా... కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో కొన్నిచోట్లు ఉరుములతో కూడిన జల్లులు లేదా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. అవి ఈ నెల 5వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది. -
నేడు కూడా కొనసాగనున్న వడగాల్పులు
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలలో నేడు కూడా వడగాల్పులు కొనసాగనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా, దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల అల్పపీడన ద్రోణులు కొనసాగుతున్నాయని తెలిపింది. అయితే ఒకటి, రెండు చోట్లు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షపు జల్లులు పడ్డాయి. -
మరో 24 గంటలపాటు తీవ్ర వడగాల్పులు
విశాఖపట్నం: ఉత్తర ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితం ఆవర్తనం ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాంధ్రలో 24 గంటలపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే భారీ ఎండలకు తోడు వడగాల్పుల వల్ల తెలుగు రాష్ట్రాలలోని మొత్తం 23 జిల్లాలలో 500 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. -
రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు
విశాఖపట్నం: మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి అవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దాంతో రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఈ రోజు సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
మరో 24 గంటలు వర్షాలు
-కొనసాగుతున్న ద్రోణి విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. చత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో కొన్నిచోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శుక్రవారం తెలిపింది. అదే సమయంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురవవచ్చని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడవచ్చని, వడగళ్ల వానలు కూడా కురవవచ్చని తెలిపింది. గడచిన 24 గంటల్లో ఈ రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమలోని మడకశిరలో 8, గుమ్మగట్టలో 7, గుత్తిలో 5, రాయదుర్గం, నందవరం, రుద్రవరంలలో 4 సెం.మీల చొప్పున, కోస్తాంధ్రలోని కొమరాడలో 4, పొదిలి, మాచెర్లలలో 3 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదయింది. అలాగే తెలంగాణలోని ఏటూరు నాగారం, గోవిందరావుపేటలలో 7, వెంకటాపూర్, మహేశ్వరపురంలలో 6, కొత్తగూడెం, మంగనూర్, గుండాలలో 5 సెం.మీల చొప్పున వర్షం కురిసింది. -
సంక్రాంతి వరకూ కొనసాగనున్న చలి తీవ్రత
విశాఖపట్నం: కోస్తాంధ్ర, తెలంగాణలో సంక్రాంతి వరకూ చలి తీవ్రత కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఉత్తరాది నుంచి గాలులు వీచడంతో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఎలాంటి అలజడి లేకపోవడం కూడా మరో కారణమని పేర్కొంది. ఉత్తర తెలంగాణ, కోస్తా, ఒడిశాలలో 4 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. -
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలో వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఉత్తరకోస్తాలో కొన్ని చోట్ల ఓ మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. -
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖపట్నం: శ్రీలంక, తమిళనాడు తీరాల మీదుగా ఏర్పడిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావారణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. అలాగే కొమోరిన్ ప్రాంతం నుండి నైరుతి మధ్యప్రదేశ్ మీదగా కర్ణాటక, మహారాష్ట్ర వరకు మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం: తమిళనాడుకు తూర్పుదిశగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దక్షిణ కోస్తాలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు... అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తరకోస్తా, రాయలసీమ, తెలంగాణల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. -
దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు
విశాఖపట్నం: దక్షిణ కోస్తాని అనుకుని అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఆ అల్పపీడనం మరికొద్ది గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో దక్షిణకోస్తాలో ఈ రోజు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఉత్తరకోస్తాలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని... కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 - 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని వెల్లడించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది. -
'ఆ నాలుగు జిల్లాలకే నష్టం ఎక్కువ'
విశాఖపట్నం: హుదుద్ తుపాన్ రేపు ఉదయం విశాఖపట్నంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పెనుగాలులు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిపింది. విద్యుత్, రవాణా వ్యవస్థలు దెబ్బతింటాయని పేర్కొంది. శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తీరం దాటిన తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో నష్టం ఎక్కువ ఉంటుందని తెలిపింది. -
ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఉపరితల అవర్తనం, అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని వివరించింది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని... అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని... దీంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో.. ఉత్తరాంధ్రకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలంగా కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ఆ అల్పపీడన ప్రాంతంలోనే ఉపరితల ఆవర్తనం అనుబంధంగా కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతేకాకుండా బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయిని... ఈ నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
ఉత్తర కోస్తాకు విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో కొన్ని గంటల్లో అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ... కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుందని పేర్కొంది. ఉత్తర కోస్తాకు ఈ మధ్యాహ్నం నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని... అలాగే రాయలసీమ, తెలంగాణలలో పలుచోట్ల అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వివరించింది. -
రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణలో భారీ వర్షాలు
విశాఖపట్నం: ఉత్తరకోస్తా, విదర్భ, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. అల్పపీడన పరిసర ప్రాంతాలలో ఉపరితల అవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. దాంతో రాగల 24 గంటల్లో ఉత్తరకోస్తా, తెలంగాణల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హచ్చరించింది. -
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ అల్పపీడనంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, తెలంగాణ, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. అల్పపీడన ప్రాంతం నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని... దాంతో తీర ప్రాంత జిల్లాల్లో గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు
విశాఖపట్నం: పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్రకు అనుకొని విశాఖ ఒడిశాల మధ్య అల్పపీడనం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం అనుకొని 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని తెలిపింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని పేర్కొంది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా తీరంలో నైరుతి దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలలో వర్షాలు
విశాఖపట్నం: ఈ నెల 28 నాటికి పశ్చిమ మధ్య వాయవ్య బంగాళఖాతంలో అల్పపీడం ఏర్పటే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ దక్షిణ కోస్తా ఆంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అది పశ్చిమబెంగాల్ వైపు బలపడుతుందని తెలిపింది. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు తీరం మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని వివరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావారణ కేంద్రం తెలిపింది. -
రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి మరింత బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలోల ఏర్పడిన ఉపరిత ఆవర్తనాలు అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి
-
ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి
ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగ్లాదేశ్ సమీపంలోని 9 కి.మీ ఎత్తున్న ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. అల్పపీడనం ఏర్పడితే రుతుపవనాల ప్రభావానికి అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ వివరించింది. -
కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు
మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు దక్షిణ కోస్తాంధ్ర మీదగా అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం విశాఖపట్నంలో వెల్లడించింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల... తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
రాగల 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఆ అల్పపీడన ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్ర మీదుగా తెలంగాణ వరకూ విస్తరించి ఉందని తెలిపింది. అల్పపీడనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీల తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాగల 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కూరిసే అవకాశాలున్నాయని చెప్పింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో పశ్చిమ గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
క్రమంగా బలహీనపడుతున్నలెహర్
విశాఖపట్నం: రాష్ట్రానికి టెన్షన్ పుట్టించిన లెహర్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. కాకినాడ నుంచి మచిలీపట్నం వైపు దిశమార్చుకుని అతి తీవ్ర స్థాయి నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడుతోంది. తీరం దాటే సమయంలో మరింత బలహీనపడి తుపానుగానే మారొచ్చని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం తుపాను పశ్చిమ వాయవ్య దిశగా మచిలీపట్నానికి 150 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద లెహెర్ తీరం దాటే అవకాశం ఉంది. లెహర్ పశ్చిమవాయవ్య దిశగా పయనిస్తుందని, ఆ తుఫాన్ తీరం దాటే సమయంలో 80- 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే తీరం దాటే సమయంలో భారీగా వర్షాలు కురుస్తాయని, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు, ఉత్తరకోస్తా జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని పేర్కొన్నారు. లెహర్ ప్రభావంతో కోస్తాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం మినహా కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 29వ తేదీ వరకు ప్రభావం ఉంటుందని, ప్రకాశం జిల్లాతోపాటు తెలంగాణలోనూ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో కొన్నిచోట్ల 80 కి.మీ. నుంచి 90 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో వీటి తీవ్రత మరింత ఉంటుందన్నారు. మచిలీపట్నంలో ఏడో నంబర్, ఓడరేవు, కాకినాడలో ఆరో నంబర్, నిజాంపట్నంలో 5వ నంబర్, మిగతా అన్ని పోర్టుల్లోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరికల్ని జారీ చేశారు. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఒక మీటరు ఎత్తు వరకు ఎగిసి పడొచ్చని, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మచిలీపట్నం తీరంలోనే ఎందుకు: తుపాన్లు మచిలీపట్నంలోనే ఎందుకు తీరం దాటుతున్నాయన్న అంశంపై నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా చల్లగాలులు వీస్తున్న కొద్దీ తుపాను బలహీనపడుతుంది. తుపాను ఎక్కడ తీరం దాటుతుందన్నది గాలి దిశపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వాయవ్యం నుంచి గాలులు వీస్తుండడంతో మచిలీపట్నం వైపు తుపాను దూసుకొస్తోంది. తుపాన్లు సముద్రంలో ఉన్నప్పుడు చాలా శక్తి కావాలి. కావాల్సిన ఉష్ణోగ్రతలుంటేనే అవి బలపడతాయని, నదీ ముఖ ద్వారాలవైపే ప్రయణిస్తాయని వాతావరణశాఖ మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. -
స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. తమిళనాడులోని నాగపట్నం తీరానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఈ సాయంత్రానికి చెన్నై- నాగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అయితే వాయుగుండం తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అయితే మత్య్యకారులు సముద్రంలో వేటకు వెళ్ల వద్దని సూచించింది. రాష్ట్రంలోని పలు పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. అయితే నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని కృష్ణ పట్నం ఓడరేవులో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. -
దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ వర్షాలు
తమిళనాడులోని నాగపట్నానికి 620 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. వాయుగుండం నాగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే సముద్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. దాంతో మత్య్సకారులను అధికారులు అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ నౌకాశ్రయాల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.