పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఆ అల్పపీడన ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్ర మీదుగా తెలంగాణ వరకూ విస్తరించి ఉందని తెలిపింది. అల్పపీడనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీల తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే రాగల 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కూరిసే అవకాశాలున్నాయని చెప్పింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో పశ్చిమ గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.