విశాఖపట్నం : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం - శ్రీలంక తీరం మధ్య అల్పపీడనం కేంద్రీకృతమైందని తెలిపింది. రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. వాయువ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం తాంబన్ - నాగపట్నం మధ్య తీరాన్ని వాయుగుండం దాటనుందని వివరించింది.