విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఉపరితల అవర్తనం, అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని వివరించింది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని... అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని... దీంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.