విశాఖపట్నం: శ్రీలంక, తమిళనాడు తీరాల మీదుగా ఏర్పడిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావారణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. అలాగే కొమోరిన్ ప్రాంతం నుండి నైరుతి మధ్యప్రదేశ్ మీదగా కర్ణాటక, మహారాష్ట్ర వరకు మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం పేర్కొంది.