విశాఖపట్నం: తమిళనాడుకు తూర్పుదిశగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దక్షిణ కోస్తాలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు... అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తరకోస్తా, రాయలసీమ, తెలంగాణల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.