విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలో వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఉత్తరకోస్తాలో కొన్ని చోట్ల ఓ మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.