విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా ద. తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమ, కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు పడతాయని పేర్కొంది. రాగల 48 గంటల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతవారణ కేంద్రం తెలిపింది.