
తెలుగు రాష్ట్రాలలో చెదురుమదురు వర్షాలు
విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఇది ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరంపై కొనసాగుతుందని పేర్కొంది. అలాగే ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ, కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు పడతాయని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కరుస్తాయని చెప్పింది. అయితే కోస్తాంధ్రలో కొన్నిచోట్ల మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.