విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ అల్పపీడనంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, తెలంగాణ, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది.
అల్పపీడన ప్రాంతం నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని... దాంతో తీర ప్రాంత జిల్లాల్లో గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.