Telugu States Heavy Rains Latest News Updates
వైఎస్ జగన్‌తో బాధితుల ఆవేదన..
- మూడు రోజులు నుంచి ఇలాగే ఉంది.
- మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
- ప్రభుత్వ సాయం ఏమైనా అందుతుందా? అని అడిగిన వైఎస్ జగన్.
- ఇప్పటి వరకు మా కోసం ఏ నాయకుడూ రాలేదు.
- జనం కోసం మీరు వచ్చారు.
- ఫస్ట్ ఫ్లోరోలో చిన్న పిల్లలతో రెండు రోజుల నుంచి ఉన్నాం.
- నీళ్లు లేవు, తిండి లేదు.
- బోట్లు ఎందుకు ఉపయోగపడం లేదు.
- నిజమైన బాధితులకు బోట్లు ఇవ్వలేదు.
పిల్లలు కూడా తిండి లేకుండా ఉన్నారు.
4:30 PM
👉వరద బాధితులతో మాట్లాడుతూ, వారిని పరామర్శిస్తూ ముందుకు కదులుతున్న వైఎస్ జగన్
👉తమ గోడును వైఎస్ జగన్‌కు చెప్పుకుంటున్న వరద బాధితులు. పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్ వద్దకు చేరుకున్న ప్రజలు.
👉వరద బాధితులను పరామర్శించేందుకు సింగ్ నగర్ చేరుకున్న వైఎస్ జగన్
👉సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలను పరిశీలించనున్న జగన్
4:00 PM
👉కాసేపట్లో వరద ముంపు ప్రాంతాలకు వైఎస్ జగన్
👉సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో పర్యటించనున్న వైఎస్ జగన్
అమరావతికి మోగుతున్న డేంజర్ బెల్
- ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా కృష్ణమ్మ ప్రవాహం
- బ్యారేజ్ నుంచి కొండవీటి వాగులోకి వెనక్కి తన్నుతున్న వరద
- కృష్ణానది వరదతో పొంగుపొర్లుతున్న కొండవీటి వాగు
- మరోవైపు వెంకటపాలెం వద్ద కరకట్ట కింద భాగం నుంచి అమరావతిలోకి ప్రవేశిస్తున్న వరద నీరు
- లింగాయపాలెంలోకి ప్రవేశించిన వరద నీరు
హైదరాబాద్‌కు రాకపోకలు ప్రారంభం.
- విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు ప్రారంభం.
- ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలన్నిటినీ అనుమతించిన తెలంగాణ పోలీస్.
- నిన్నటి నుంచి ఆంధ్రలో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద నిలిచిపోయిన వాహనాలు.
- కాసేపటి క్రితమే తెలంగాణ పోలీసులు అనుమతించడంతో, హైదరాబాద్ వెళ్లేందుకు వాహనదారులు బయలుదేరారు.
- వాహనాలను అనుమతించడంతో కొంత ఉపశమనం లభించింది.
అధికారుల వాహనాలతో ఫ్లై ఓవర్ ఫుల్..
- అధికారుల వాహనాలతోనే నిండిపోయిన ఫై ఓవర్.
- మంత్రులు, అధికారుల వాహనాలను మాత్రమే ఫ్లై ఓవర్ మీదకు పంపుతున్న పోలీసులు.
- మంత్రులు, అధికారుల వాహనాలు ఎస్కార్ట్ వాహనాలు కూడా అనుమతి ఇస్తున్న పోలీసులు.
- ప్రజల తరలింపునకు ఎటువంటి చర్యలు తీసుకొని అధికారులు.
- అధికారుల వాహనాల వల్ల అంబులెన్స్‌లకు సైతం ఇబ్బందిగా మారింది.
రేపల్లెకు వరద ముంపు ప్రమాదం..
- రేపల్లెలోకి వరద నీరు వచ్చే అవకాశం.
- రేపల్లె ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ మురళీ.
విజయవాడలో ముంపు బాధితుల హాహాకారాలు.
- ముంపులో కాపాడేందుకు బోట్లు రాకపోవడంతో బాధితుల అవస్థలు.
- కేవలం 110 బోట్లు మాత్రమే ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- వరద పోటెత్తడంతో సగం దూరం దాటి వెళ్లలేకపోయిన బోట్లు.
- 12 అడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీరు.
బ్యారేజీపై రాకపోకలు బంద్..
- ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న కృష్ణానది
- ప్రకాశం బ్యారేజీ పై రాకపోకలు నిలిపివేత
- ఎవరూ బ్యారేజ్ దాటకుండా ఉండేందుకు పోలీస్ పికెట్ ఏర్పాటు
సింగినగర్‌వాసుల కన్నీరు..
- కన్నీళ్లు పెడుతున్న సింగినగర్ వాసులు.
- పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని అంటున్న ప్రజలు.
- వాళ్ళ ఆకలి చూడలేక రిస్క్ అయినా తెగించి బయటకి వస్తున్నాం.
- ఒక్క బోటు రావడం లేదు.
- కనీసం మంచినీరు కూడా అందించడం లేదని వాపోతున్న ప్రజలు.
- రెండు మూడు కిలోమీటర్ల నుండి పీకలోత్తు నీటిలో వచ్చి.. మళ్ళీ ఫుడ్, పాలు తీసుకొని లోపలకి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాసేపట్లో విజయవాడకు వైఎస్ జగన్
- విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన
- బాధితులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకోనున్న జగన్
- ఈ ఉదయం వైఎస్సార్ జిల్లా నుంచి గన్నవరం చేరుకున్న జగన్
- కృష్ణలంక వద్ద వరద ప్రవాహ పరిశీలన
- రిటైనింగ్ వాల్‌తో వరద ముప్పు తప్పిందని సంతోషం వ్యక్తం చేసిన కృష్ణలంక ప్రజలు
- జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేసిన స్థానికులు
బెజవాడకి అమావాస్య గండం
- అమావాస్య కారణంగా పోటు మీద ఉన్న సముద్రం
- పోటు మీద ఉన్నప్పుడు వరదని తనలో ఇముడ్చుకోలేని సముద్రం
- ఎగువ నుంచి భారీ వరద, దిగువ నుంచి సముద్ర పోటు
- ఏం జరగనుందో అని నగరవాసుల్లో పెరిగిపోతున్న భయం
బలహీనపడనున్న వాయుగుండం.. తెలంగాణపై..
- రానున్న 12 గంటల్లో బలహీనపడనున్న వాయుగుండం
- ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
- కొన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
- మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- రానున్న 12 గంటల్లో బలహీనపడనున్న వాయుగుండం
- ఇవాళ హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం
- భారీ వాన ముప్పు తప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు
ఖమ్మంలో వరద ఉద్ధృతి.. నీట మునిగిన కార్లు
- ఖమ్మంలో మున్నేరు వరద ఉద్ధృతి
- పదులో సంఖ్యలో నీటమునిగిన కార్లు
గరికపాడు వద్ద రహదారిని పరిశీలించిన ఇంజినీరింగ్ అధికారులు
- ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కోతకు గురైన జాతీయ రహదారి
- ఎన్ హెచ్ 65పై నిన్న మధ్యాహ్నం నుంచి నిలిచిపోయిన రాకపోకలు
- రహదారి మరమ్మతులు.. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమావేశం
- రహదారిని పరిశీలించిన ఇంజినీరింగ్ అధికారులు
- పరిశీలించిన ఎన్హెచ్ సిబ్బంది, ఆర్ అండ్ బీ అధికారులు
- ఇప్పటికే రహదారిని పరిశీలించిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- నల్లబండగూడెం వద్ద ప్రయాణానికి అనుకూలంగా ఉన్న రహదారి
- పాలేరు వాగు ఉధృతి తగ్గితే మరమ్మతులు చేప్పట్టేందుకు సిద్ధంగా ఉన్న అధికారులు
రేపల్లె ప్రజలకు అలర్ట్
- రేపల్లె ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: బాపట్ల కలెక్టర్
- భారీ వర్షాలతో పెద్ద పులివర్రు వాగు కట్ట తెగే అవకాశాలు
- రేపల్లె పట్టణ వాసులు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి విజ్ఞప్తి
మోకిలలోని గేటెడ్ కమ్యూనిటీలోకి వరద
- రంగారెడ్డి: శంకర్‌పల్లి మోకిలలోని గేటెడ్ కమ్యూనిటీలోకి వరద
- రెండ్రోజులుగా భారీ వర్షాలకు గేటెడ్ కమ్యూనిటీలోకి వరద నీరు
- వరదల కారణంగా మోకిలలో రహదారులు జలమయం
- వరదల వల్ల అలుగు పారుతున్న నల్లగండ్ల చెరువు
- శంకర్‌పల్లి మోకిలలోని గేటెడ్ కమ్యూనిటీలోకి వరద
- రెండ్రోజులుగా భారీ వర్షాలకు గేటెడ్ కమ్యూనిటీలోకి వరద నీరు
- వరదల కారణంగా మోకిలలో రహదారులు జలమయం
ఉత్తరాంధ్రకు మరో అల్పపీడనం ముప్పు
- వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అవకాశం
- పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న అల్పపీడనం
- ఈ నెల 5 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం
విజయవాడ వెళ్లే బస్సులు యధాతథం!
- ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
- విజయవాడ విశాఖ మధ్య నడుస్తున్న బస్సులు
- విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులను డైవర్షన్ రూట్‌లో నడిపిస్తున్న ఆర్టీసీ
- రాయలసీమ నుంచి వెళ్లే సర్వీసులకు మాత్రం విఘాతం
తెలుగు రాష్ట్రాల వరదలపై రాహుల్ గాంధీ స్పందన
- తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లో వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.
- వరద సహాయక చర్యల్లో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలి
- వరద సహాయక చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.
- ఈ విపత్తులో నష్టపోయిన వారందరికీ త్వరితగతిన అన్ని రకాలుగా ఆదుకోవాలి
- కేంద్ర ప్రభుత్వం తో పాటు ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ప్రభుత్వాలను కోరుతున్నా
My thoughts are with the people of Telangana and Andhra Pradesh as they endure relentless rainfall and devastating floods.
I extend my deepest condolences to the families who have lost their loved ones. I urge Congress leaders and workers to mobilize all available resources to…— Rahul Gandhi (@RahulGandhi) September 2, 2024
ఖమ్మం బయల్దేరిన సీఎం రేవంత్
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న రేవంత్
- వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించునున్న సీఎం
- రాత్రికి ఖమ్మంలోని బస
- రేపు ఉమ్మడి వరంగల్‌లో పర్యటన
వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీ సభ్యత్వ నమోదు వాయిదా
- తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు
- వరదల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వాయిదా
- ప్రకటించిన బీజేపీ సీనియర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు
- ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం: రామచందర్ రావు
- వర్షాలతో ఇబ్బంది పడుతున్నా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలనే పార్టీ భావిస్తోంది: రామచందర్ రావు
- కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లు హోం మంత్రి అమిత్ షా తోపాటు జేపీ నడ్డాతో ఫోన్‌లో మాట్లాడారు: రామచందర్ రావు
- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రధాని మోదీ,అమిత్ షా మాట్లాడారు: రామచందర్ రావు
- సహాయ కార్యక్రమాలకు హెలికాప్టర్ లు కేంద్రం నుండి పంపించారు: రామచందర్ రావు
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలి
- కలెక్టరేట్ ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలి - భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలి
- వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు
- ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలి
- వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలి
- వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలి
- ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు విడుదల చేస్తున్నాం
- వర్షాల సమయంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కమిషనర్లు చర్యలు తీసుకోవాలి
- వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలి
- విద్యుత్ సరఫరా లో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
తెలంగాణలో వానలు.. వరదలు.. ఆర్టీసీపై ప్రభావం
- తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా ఆర్టీసీ బస్సులు కొన్ని ప్రాంతాలలో రద్దు చేసినట్టు సమాచారం..
- నిన్న రాత్రి వరకు 877 బస్సులను రద్దు చేశారు ఆర్టీసీ అధికారులు..
ఇవ్వాళ ఉదయం నుంచి 570 బస్సులను రద్దు చేశారు... - ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ , మహబూబ్ బాద్ వైపుగా వెళ్ళే రోడ్ లన్ని జలమయం అవ్వడంతో బస్సు రూట్ లు పూర్తిగా క్లోజ్ చేసినట్టుగా సమాచారం...
- వరద ఉధృతి తగ్గిన తర్వాత మళ్ళీ బస్సులను నడుపుతామని అంటున్న ఆర్టీసీ అధికారులు
- 117 గ్రామాలకు రాకపోకలు బంద్
- వాగులు, వంకలు పొంగి పొర్లడంతో తెగిపోయిన రహదారులు
- వర్షం తగ్గుముఖం పట్టగానే మరమ్మత్తు పనులు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు
- వీలైనంత త్వరగా పనులు చేపట్టేలా పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం కసరత్తు
- ఆయా గ్రామలకు వెల్లే రాహదారులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి.
- అత్యధికంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 33 గ్రామాలకు వెల్లే రహదారులు దెబ్బతిన్నాయి..
- కరీం నగర్ లో 20 గ్రామాల రోడ్లు పాడయ్యాయి. 20 గ్రామాలకు సంబంధాలు కట్ అయ్యాయి.
- మహబూబ్ బాద్ లో 30 గ్రామాలు.
- ఉమ్మడి మెదక్ లో 8 గ్రామాలకు.
- నిజామాబాద్ లో 7 గ్రామాలకు.
- నల్గొండ లో 4 గ్రామాలకు వెల్లే రహదారులు కొట్టుకపోయాయి.
విజయవాడ పరిస్థితిపై ఉండవల్లి ఆవేదన
- విజయవాడ వరదలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆవేదన
- విజయవాడ పరిస్థితి చూస్తుంటే కళ్ళ వంటి నీరు వస్తుంది: ఉండవల్లి
- రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి: ఉండవల్లి
తెలంగాణ సెక్రటేరియట్ లో అధికారుల నిర్లక్ష్యం
- సెక్రటేరియట్ లో పనిచేయని వర్షాల కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నెంబర్లు.
- ఒకే నెంబర్ - ఒక్కరే సిబ్బందిని కేటాయించిన ప్రభుత్వం.
- ఫిర్యాదులు స్వీకరణ, అప్రమత్తం కోసం కంట్రోల్ రూం లో ఒక్కరూ మాత్రమే పనిచేస్తున్న ఉద్యోగి.
- వర్షాల అప్డేట్ కోసం జిల్లాల నుంచి ఫిర్యాదులు స్వీకరణ, అప్రమత్తం చేయడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు .
- 24 గంటలు అందుబాటులో ఉండాలని అధికారులకు సిఎం సూచన.
- కానీ కంట్రోల్ రూమ్ వద్ద అందుబాటులో లేని అధికారులు.
- జిల్లాల నుంచి సాయం కోసం సెక్రటేరియట్ కు ఫోన్ కాల్స్.
- హెలికాప్టర్లు, ఎన్డిఆర్ఎఫ్ , రెస్క్యూ టీమ్స్ కావాలని కోరుతున్న జిల్లాల అధికారులు.
- ఉన్నతాధికారులు - అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
చంద్రబాబు నివాసంలోకి భారీగా వరద నీరు
- ఆరు మోటార్లతో నీటిని తోడేస్తున్న సిబ్బంది
- వరద ప్రవాహం అడ్డుకునేందుకు లారీల్లో ఇసుక తలరింపు
- ప్రమాదకరంగా మారిన చంద్బరాబు కరకట్ట నివాసం
- నిన్ననే నివాసం నుంచి బయటకు వచ్చేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులు
తెలంగాణ: వరద మృతుల పరిహారం పెంపు
- వరదల్లో చనిపోయిన వాళ్ల కుటుంబాలకు ఆర్థిక సాయం పెంపు
- రూ.4 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచిన రేవంత్ సర్కార్
అర్ధాంతంరంగా ముగిసిన ఏపీ హైకోర్టు కార్యకలాపాలు
- ఏపీ హైకోర్టులోకి వరద నీరు
- సోమవారం ప్రారంభమైన కాసేపటికే ముగిసిన కోర్టు కార్యకలాపాలు
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
- ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ
- వరద ప్రాంతాల్లో పర్యటించాలని.. తక్షణ సాయం విడుదల చేయాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
- నిన్న తెలంగాణ వరదలపై ప్రధాని మోదీ ఆరా
- సీఎం రేవంత్‌కు ఫోన్ చేసి మాట్లాడిన ప్రధాని
- కేంద్రం అండగా ఉంటుందని భరోసా
విజయవాడ వాసుల్ని భయపెడుతున్న కృష్ణమ్మ
- కరకట్ట గోడ వద్ద కోత
- ఇసుక బస్తాలతో పటిష్టం చేసేందుకు పోలీసుల యత్నం
- ప్రమాదంలో రివర్‌వ్యూ.. పార్క్ సందర్శన నిలిపివేత
హృదయవిదాకరంగా సింగ్ నగర్ వాసుల కష్టాలు
- సింగ్ నగర్‌లో పీకల్లోతు కష్టాల్లో ప్రజలు
- నరకం చూపిస్తున్న అధికార యంత్రాంగం
- ప్రాణాలకు తెగించి నీళ్లు, ఆహారం కోసం వస్తున్న వైనం
- పసిపిల్లల పాల కోసం తల్లుల ఎదురు చూపులు
- బోట్లలో ఆహారం అందించడం లేదని వాపోతున్న ప్రజలు
విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- తమిళనాడు నుంచి 3, 4 పంజాబ్, 3 ఒడిశా రాష్ట్రల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో బృందాలు
- ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా సహాయక చర్యల్లో 8NDRF, 10SDRF బృందాలు
మూసీ హెచ్చరికలు
- శంకర్‌పల్లిలో భారీ వర్షం
- పొంగిపొర్లుతున్న మూసీ నది
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
జగన్‌కు కృష్ణలంక వాసుల కృతజ్ఞతలు
- మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన కృష్ణలంక వాసులు
- జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
- రిటైనింగ్ వాల్ వల్ల తమ ప్రాణాలు నిలబడ్డాయని జగన్‌తో చెప్పిన ప్రజలు
- రిటైనింగ్ వాల్ లేకపోతే మా పరిస్థితి కూడా సింగ్ నగర్ ప్రజల పరిస్థితిగానే ఉండేదని వ్యాఖ్య
సాక్షి టీవీ తో దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్
- దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు 432 పైగా రైళ్లు రద్దయ్యాయి
- 13 కొన్ని పాక్షికంగా రద్దు చేశాం
- 139 రైళ్లు దారి మళ్ళించాం
- ఈరోజు ఉదయం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ట్రాక్ దెబ్బతిన్న ప్రాంతానికి వెళ్లారు
- ట్రాక్ పునరుద్దరణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
- రేపు సాయంత్రం వరకు రైళ్ళ పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది.
- దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఆరు డివిజన్లలో పరిస్తితి పై కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం.
- ట్రాక్ పూర్తిగా దెబ్బతింది.
- పనులు వేగంగా సాగుతున్నాయి
- ఇవాళ సాయంత్రం వరకు ఒక ట్రాక్ సిద్ధమయ్యే అవకాశం ఉంది
- రేపు సాయంత్రం వరకు పూర్తిగా ట్రాక్స్ సిద్దం అవుతుంది
వర్షాలు.. వరదలపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
- వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం
- విద్యుత్, మంచి నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూస్తున్నాం
- ముందు జాగ్రత్తల వల్లే ప్రాణ నష్టం నివారించగలిగాం
- అధికారులు 24 గంటలు విధుల్లో ఉండి శ్రమిస్తున్నారు
బుడమేరులో రెస్క్యూ ఆపరేషన్
విజయవాడ బుడమేరులో రెస్క్యూ ఆపరేషన్
ఫైర్, ఎస్‌డీఆర్‌ఎప్, ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆపరేషన్
బుడమేరు ప్రభావంతో ఇబ్బంది పడుతున్న 2.5 లక్షల మంది
హైదరాబాద్
- మరికాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి.
- అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయలుదేరనున్న సీఎం ..
- ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం
రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
పంజాబ్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొన్న NDRF బృందాలు
సుమారు 100 మందితో కూడిన సభ్యులు
బృందంలో డాగ్ స్క్వాడ్ కూడా
ఇప్పటికే పవర్ బోటుల రాక
నేవీ హెలికాఫ్టర్ల ద్వారా రంగంలోకి రెస్క్యూ టీంలు
ఆహార పోట్లాలను అందించే ప్రయత్నం
ప్రమాదం అంచున కరకట్ట!!
- సీఎం చంద్రబాబు నివాసం వైపు ఉధృతంగా వరద
- మంతెన సత్యనారాయణ ఆశ్రమం ని ఖాళీ చేయిస్తున్న పోలీసులు
- మంతెన ఆశ్రమంలో కి చొచ్చుకొచ్చిన వరద నీరు
- అదే కట్ట లోపల ఉన్న సీఎం చంద్రబాబు నివాసం
మేడిగడ్డకు పోటెత్తిన వరద
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం,
- కాళేశ్వరం గోదావరి పుష్కర ఘాట్ ల వద్ద 7.100 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి-ప్రాణహిత
- మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కి కొనసాగుతున్న వరద
- మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 2,69,730 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల.
- ఇన్ ప్లో ఔట్ ఫ్లో 2,69,730 క్యూసెక్కులు
- లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసీలు
- వర్షం కారణంగా సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లోకి చేరిన వరద నీరు
- కాకతీయ ఓపెన్ కాస్ట్2,3 గనుల్లో నిలిచిపోయిన 18 వేల బొగ్గు ఉత్పత్తి
- సింగరేణి సంస్థ కు ఇప్పటిదాకా సుమారు రెండు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం
వరద నేపథ్యంలో మంత్రి సీతక్క సమీక్ష
మెదక్
- హవేలీ ఘన్‌పూర్‌లో పెద్ద చెరువుకు గండి
- భారీగా పంట నష్టం
- గుండెలు బాదుకుంటున్న రైతులు
బోటు ప్రమాదం
- కృష్ణా నదిలో పాట్రోలింగ్ బోటు బోల్తా
- తోట్లవల్లూరు మండలంలో పునరావాస శిబిరానికి వరద బాధితుల్ని తీసుకొస్తున్న బోటు
- అన్నవరపులంక వద్ద బోల్తా
- ప్రమాద సమయంలో బోటులో 8 మంది
- అంతా క్షేమంగా ఉన్నారని అధికారుల ప్రకటన
- ఇద్దరు గల్లంతయ్యారని చెబుతున్న తోటి బాధితులు
సీఎం రేవంత్ సమీక్ష
- కాసేపట్లో వరద సహాయక చర్యలపై సీఎం రేవంత్ సమీక్ష
- తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
- 18 మంది మృతి
- జనజీవనం అస్తవ్యస్తం
ప్రమాదం అంచున రామలింగేశ్వరనగర్
- కృష్ణా నదికి పోటెత్తిన వరద
- లీకేజీ సమస్యతో పోటెత్తిన వరద
- రిటైనింగ్ వాల్‌తో తప్పిన భారీ ప్రమాదం
- వాల్ ఉండడంతో ఆగిపోయిన వరద ప్రవాహం
- సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న రామలింగేశ్వరనగర్ వాసులు
బెజవాడలో రంగంలోకి దిగిన నేవీ హెలికాఫ్టర్లు
- ప్రకాశం బ్యారేజ్ కు భారీగా పోటెత్తిన వరద
- విజయవాడ నగరాన్ని ముంచేస్తున్న కృష్ణానది వరద
- ప్రకాశం బ్యారేజ్ ఎగువున రివర్స్ లో పైకి రోడ్డెక్కిన వరద
- భవానీపురం ,స్వాతీ సెంటర్ వద్ద రోడ్డు పైకి చేరుకున్న కృష్ణా వరద
- రంగంలోకి దిగిన నేవీ హెలికాఫ్టర్లు
- తాడు సాయంతో వరదలో చిక్కుకున్న వాళ్లను కాపాడుతున్న రెస్క్యూ టీం
గజగజ.. విజయవాడ
- నగరంలో 12 డివిజన్లలో ముంపు
- ముంపులో మూడున్నర లక్షల మంది ప్రజలు
- రెండురోజులుగా ముంపులోనే లక్షలాది ప్రజలు
- వరద బీభత్సంతో 10 మంది మృతి
- నీళ్లు, ఆహారం, కరెంట్ లేక అవస్థలు పడుతున్న ముంపు బాధితులు
- పసిపిల్లలకు పాల ప్యాకెట్లు కూడా దొరక్క అవస్థలు
- ముంపునుండి బయటపడటానికి బోట్లు లేక హాహాకారాలు
- నిన్న రాత్రంతా చిమ్మచీకట్లలోనే ముంపు ప్రజలు
- మేడలు, మిద్దెలపైనే చంటి పిల్లలతో అవస్థలు
- మునిగిపోయిన అజిత్‌సింగ్‌నగర్, నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఎల్‌బీఎస్‌నగర్,
- మునిగిపోయిన వాంబేకాలనీ,అయోధ్యనగర్, మధురానగర్, రామకృష్ణాపురం, మధురానగర్,
- మునిగిపోయిన ఓల్ న్యూ రాజరాజేశ్వరిపేట, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, పైపులరోడ్డు,కండ్రిక,
- మునిగిపోయిన పాయకాపురం, శాంతినగర్, ప్రశాంతినగర్, జక్కంపూడి, పాతపాడు,
- మునిగిపోయిన నైనవరం, చిట్టినగర్, మిల్క్‌ప్రాజక్ట్ ఏరియా, వించిపేట
- కృష్ణా నది పరివాహకంలో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
- రిటైనింగ్ వాల్ ప్రాంత ప్రజలు మాత్రమే సేఫ్
- కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరద
- 11.37 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
- వరద ధాటికి ప్రకాశం బ్యారేజ్ కి కొట్టుకొస్తున్న బోట్లు
- భయం గుప్పెట్లో అమరావతి
- మంతెన ఆశ్రమం వద్ద కరకట్టకు లీకేజీ
- ఇసుక బస్తాలు వేసినా ఆగని లీకేజీ
- సీఎం చంద్రబాబు నివాసానికి ముంపు ముప్పు
- చంద్రబాబు నివాసం చుట్టుపక్కల నివాసాలన్నీ ముంపు
కృష్ణా
- గరికపాడు వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జికి కోత
- పాలేరు వరద ఉధృతి కి దెబ్బతిన్న జాతీయ రహదారి
- ఆంధ్రా, తెలంగాణ మధ్య నిలిచిపోయిన రాకపోకలు
చంద్రబాబూ.. మీరు రావొద్దు!
- మరొసారి విజయవాడ సింగినగర్ రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- చంద్రబాబు రావడం వల్ల.. తమకు అందే సహాయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్న స్థానికులు
- సహాయం చేయకుండా పరామర్శలకు వస్తే ఉపయోగం ఏంటని పశ్నిస్తున్న సింగినగర్ వాసులు
- అయినా పర్యటన మొదలుపెట్టిన చంద్రబాబు
హైదరాబాద్ వాసులకు జీహెచ్‌ఎంసీ అలర్ట్
- అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరిక
- నాలాలు, చెరువుల వద్దకు వెళ్లొద్దు: GHMC
- రోడ్లపై వాహనదారులు, కాలినడక వెళ్లేవాళ్లు అప్రమత్తంగా ఉండాలి: GHMC
- మ్యాన్‌హోల్స్, కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన
విజయవాడ: కృష్ణమ్మ ఉగ్రరూపం
- ప్రకాశం బ్యారేజ్‌కు ఆల్‌టైం రికార్డ్ స్థాయిలో వరద
- తొలిసారి 11 లక్షల క్యూసెక్కులు దాటిన వరద
- ప్రమాదకరంగా కృష్ణలంక రైల్వే బ్రిడ్జి
- రైల్వే బ్రిడ్జి అంచుదాకా వచ్చిన వరద ప్రవాహం
- 125 ఏళ్ల బ్యారేజ్ చరిత్రలో రికార్డు స్థాయి వరద
- నదిలో కొట్టుకొస్తున్న పడవలు
- బ్యారేజీ గేట్లను ఢీ కొట్టిన భారీ పడవలు.. పక్కకు వంగిపోయిన 69వ గేటు
- డేంజర్ జోన్‌లో బ్యారేజ్ దిగువ ప్రాంతాలు
ఏలూరు
- పోలవరం ప్రాజెక్టు వద్ద పెరిగిన గోదావరి వరద
- స్పిల్ వే ఎగువన 30.920 మీటర్లు.. దిగువన 22.100 మీటర్లు నీటిమట్టం.
- 48 రేడియల్ గేట్ల ద్వారా 6,50,077,క్యూసెక్కుల గోదావరి వరద నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు
సూర్యాపేట
- కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద కొనసాగుతున్న ట్రాఫిక్ జామ్
- తెలుగు రాష్ట్రాల సరిహద్దు వంతెన పాక్షికంగా దెబ్బతినడంతో ట్రాఫిక్ ని ఆపిన పోలీస్ సిబ్బంది
- జాతీయ రహదారిపై నందిగామ వద్ద మున్నేరు వాగు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం
- తెలంగాణ నుండి ఆంధ్ర వైపు వెళ్లే బ్రిడ్జి స్వల్పంగా తెగిపోవడంతో నిలిచిన వాహనాలు
- జాతీయ రహదారి అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వంతెనను పరిశీలించిన అనంతరం ట్రాఫిక్ ని వదులుతామన్న కోదాడ డి.ఎస్.పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి
ఖమ్మం
- జలగం నగర్ నీట మునిగిన ఇళ్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఆదుకోవాలని స్థానికుల డిమాండ్
భారీగా రైళ్ల రద్దు
- దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్ల రద్దు
- నిన్న రాత్రి వరకు 177 రైళ్ల రద్దు
- ఈ ఉదయం నుంచి 96 రైళ్ల రద్దు చేసిన అధికారులు
- పదుల సంఖ్యలో రైళ్ల దారి మళ్లింపు
- కమ్యూనికేషన్ లోపంతో ప్రయాణికుల అవస్థలు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
జలదిగ్బంధంలో విజయవాడ నగరం
- భారీ వర్షాలతో నీట మునిగిన విజయవాడ
- ఎటు చూసినా వరద.. జనజీవనం అస్తవ్యస్తం
విజయవాడ వరద బాధితుల ఇక్కట్లు
మాకు ఆహారం అందలేదు.. కనీసం తగెందుకు నీరు కూడా లేదు
కనీసం ఒక్క బోటు కూడా మా దగ్గర కి రాలేదు
- చిన్నపిల్లలు వున్నారు.. ఇబ్బందులు పడుతున్నాం
- లక్ష 50వేల ఆహారపోట్లాలు ఏమయ్యాయి.. 5లక్షల ఓటర్ బాటిల్స్ ఎక్కడ?
భవానీపురం క్రాంబేరోడ్డు స్థితి ఇది
రైల్వే బ్యారేజీ అతిసమీపంలో నీరు
- కృష్ణా నదికి భారీగా పోటెత్తిన వరద నీరు
- విజయవాడ రైల్వే బ్యారేజీకి మూడు అడుగుల దూరంలో వరద నీరు
- వరద పెరిగితే రైల్వే ట్రాక్‌పైకి నీరు వచ్చే అవకాశం
80కి పైగా రైళ్లు రద్దు
- మహబూబాబాద్ కు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్
- కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ వద్ద కొనసాగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనులను పరిశీలించనున్న జీఎం
- నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనులు
- పూర్తిగా ట్రాక్ కింద కొట్టుకుపోయిన మట్టి.
- సుమారు 80 కి పైగా రైళ్లు రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే
- రైల్ నిలయం లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం
Speedy restoration works in progress in the affected section due to incessant rains in Intakanne - Kesamudram Section, Secunderabad Division, Telangana. SCR Officials monitoring the restoration works camping at the affected site. pic.twitter.com/eok1XaHHgk
— South Central Railway (@SCRailwayIndia) September 1, 2024
మళ్లీ ప్రమాదం అంచున కడెం!!
- అధికారుల అప్రమత్తం
- మొత్తం 18 గేట్లు ఎత్తివేత
- వచ్చిన వరద నీటిని వచ్చినట్లే కిందకు వదులుతున్న అధికారులు
- పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు
- ప్రస్తుత మట్టం 695 అడుగులు
భారీ వర్షాలతో ఖమ్మం అతలాకుతం
- మున్నేరుకు భారీగా వరద నీరు
- జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు
- మున్నేరు వరదలో చిక్కుకున్న 9 మంది సురక్షితం
- ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద 13 గంటలపాటు నరకయాతన
- జేసీబీ సాయంతో క్షేమంగా బయటకు వచ్చిన బాధితులు
- డ్రోన్ కెమెరాల సాయంతో కదలికలను గమనించిన రెస్క్యూ టీం
ఇంద్రకీలాద్రి రూట్ మూసివేత
- కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసం
- ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ తాత్కాలికంగా మూసివేత
- రహదారిపై రాకపోకలు బంద్
- కొండచరియలు విరిగిపడి ఇప్పటికే ఆరుగురు మృతి
కృష్ణా
- అవనిగడ్డ నియోజకవర్గం
- ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ
- కొనసాగుతున్న కృష్ణానది వరద ఉధృతి
- నీట మునిగిన పులిగడ్డ ఆక్విడెక్ట్
- దివిసీమలోని పంటపోలాలు ఇళ్లలోకి వచ్చిన వరద నీరు
- లంక గ్రామాల్లోని, కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాల్లోకి తరలించిన అధికారులు
అమరావతి.. బెజవాడ.. అస్తవ్యస్తం
- ఎమ్మెల్యేల నివాస భవనాల్లోకి చేరిన వరద నీరు
- జలదిగ్బంధంలో హైకోర్టు, సచివాలయం, ప్రభుత్వ భవనాలు
- ప్రభుత్వ వైఫల్యంతో నిండా మునిగిన బెజవాడ
- బెజవాడను ముంచెత్తిన బుడమేరు వరద
- పలు కాలనీలకు నిలిచిన రాకపోకలు
- విజయవాడ హైదరాబాద్ రహదారిపై వరద ప్రవాహం
- నిన్న మధ్యాహ్నాం నుంచి నిలిచిన రాకపోకలు
- ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కోతకు గురైన రహదారి
- పాలేరు వాగు ఉధృతిలో కోతకు గురైన రహదారి
- హైదరాబాద్-కోదాడ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలు మళ్లింపు
- నల్గొండ, గుంటూరు మీదుగా విజయవాడకు వాహనాలు
- ఎక్కడికక్కడే నిలిచిపోయిన రాకపోకలు
- జలదిగ్బంధంలో రాయనపాడు రైల్వేస్టేషన్
- విజయవాడ-కొండపల్లి ట్రాక్‌పై భారీగా వరద
- విజయవాడలో 10కి చేరిన మృతుల సంఖ్య
- కొండచరియలు విరిగిపడి ఆరుగురు, వరదల్లో ఇద్దరు, మరో ఇద్దరు గల్లంతు
విజయవాడ
- సింగినగర్ ఫ్లై ఓవర్ పై వరద బాధితుల ఆందోళన
- అధికారులు సహాయక చర్యలు చెప్పటడం లేదని ఆందోళన చెందుతున్న ప్రజలు
- తమ కుటుంబ సభ్యులు వరదల్లో చిక్కుకున్నారని కాపాడలంటూ వేడుకొంటున్న ప్రజలు
- మీరు సహాయక చర్యలు చేయకపోతే కనీసం మమ్మల్ని అయిన లోపలకి పంపాలంటూ వేడుకొంటున్న ప్రజలు
- ఆహారం మొత్తం ఫ్లైఓవర్ మీద పెట్టుకున్నారు తప్ప వరదలో చిక్కుకున్న వారికి కనీసం ఆహార అందించలేదని వాపోతున్న ప్రజలు
- ఫ్లైఓవర్ దగ్గర ఉంటే బయటికి వెళ్లిపోమంటూ పోలీసులు తోసేస్తున్నారంటూ ప్రజల ఆందోళన
ఖమ్మం
- జలగం నగర్ వద్ద స్థానికుల నిరసన
- అన్ని కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం
మహబూబాబాద్
- ఈదుల పూసపల్లి సమీపంలోని రాళ్లవాగులో డీసీఎం వ్యానుతో కొట్టుకుపోయిన ఐదుగురు వ్యక్తులు
- రెస్క్ టీం సహాయంతో నలుగురు వ్యక్తులను కాపాడిన NDRF సిబ్బంది
- రాళ్ల వాగులో మరో ఒక వ్యక్తి గల్లంతు
- కేసముద్రం మండలం ఇంటికన్నె ,తాళ్ళపూసపల్లి రైల్వేస్టేషన్ శివారులో వరదనీటితో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
- మరమ్మతు పనులను వేగవంతం చేసిన రైల్వే అధికారులు
జగిత్యాల - ధర్మపురి పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- క్రమక్రమంగా క్రమంగా పెరుగుతున్న గోదావరి మట్టం
- పుష్కర ఘాట్ల నుండి ప్రవహిస్తున్న నది
- నేరెళ్ళ పసుల పాపన్న గుట్ట వద్ద లో లేవన్ వంతెనపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు,
- జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
బిక్కుబిక్కుమంటున్న కృష్ణా పరీవాహక ప్రాంతాలు
- ప్రకాశం బ్యారేజ్ కి ఆల్ టైం రికార్డుస్ధాయిలో వరద
- తొలిసారి 11 లక్షల క్యూసెక్కులు దాటిన వరద నీరు
- ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రమాదకరంగా కృష్ణమ్మ ప్రవాహం
- 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డు స్ధాయిలో కృష్ణమ్మకి వరద ప్రవాహం
- ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.25 లక్షలు క్యూసెక్కులు దాటిన ఇన్ ఫ్లో
- 2009 సంవత్సరం అక్టోబర్ 5 న రికార్డుస్ధాయిలో 10,94,422 క్యూసెక్కుల వరదనీరు
- 2009 వరదలని మించిన స్ధాయిన కృష్ణమ్మకి పోటెత్తిన వరద
- అంతకముందు 1903 అక్టోబర్ 7 లో మాత్రమే 10,60,830 లక్షల క్యూసెక్కుల వరద
- ఇపుడు ఏకంగా 11 లక్షల క్యూసెక్కుల దాటిన వరద ప్రవాహం
- అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహంతో బిక్కుబిక్కుమంటున్న కృష్ణా పరీవాహక ప్రాంతాలు
- ఇప్పటికే బుడమేరుకి గండిపడటంతో నీటమునిగిన సింగ్ నగర్,ఊర్మిలానగర్, ప్రకాశ్ నగర్, వాంబేకాలనీ, ఖండ్రిగ,పైపుల రోడ్, న్యూ రాజరాజేశ్వరిపేట, వైఎస్సార్ కాలనీ, జక్కుంపూడి కాలనీ తదితర ప్రాంతాలు
విజయవాడ
- భారీ వరదకు కృష్ణానదిలో భారీ కొట్టుకొస్తున్న పడవలు
- ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన మూడు భారీ పడవలు(పంట్లు)
- వేగంగా వచ్చి 69వ నెంబర్ గేట్ ను ఢీకొట్టిన పడవలు
- పడవలు ఢీకొట్టడంతో ధ్వంసమైన 69వ నెంబర్ గేటు
- విరిగిపోయిన గేటును పైకెత్తే చైన్ లింక్ దిమ్మ
- ఒకపక్కకు ఒంగిపోయిన 69వ నెంబర్ గేటు
- డేంజర్ జోన్ లో ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాలు
పెద్దపల్లి
- శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు ఎగువన కడెం నుంచి భారీగా వరద నీటి ప్రవాహం
- ఇన్ ఫ్లో 3, 22, 821 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 4, 50, 184 క్యూసెక్కులు
- ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు
- ప్రస్తుత నిల్వ 18. 7862 టీఎంసీ లు
- ప్రాజెక్ట్ కు సంబంధించిన 30 గేట్లు తెరచి 4, 40, 430 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు
- నది పరివాహక గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరికలు
- పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాలను కలుపుతూ శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ఉన్న రహదారిపై నుంచి రాకపోకలు నిలిపివేసిన అధికారులు
విజయవాడ
- ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు వరద
- మహోగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ
- కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- ఇన్ ఫ్లో,అవుట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కులు
- మొత్తం 70 గేట్లు పూర్తిగా ఎత్తివేత
- కృష్ణానది కరకట్టల వెంట హై అలర్ట్
పెద్దపల్లి
- నక్కల వాగులో గల్లంతైన వ్యక్తి మృతి
- కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జoపేట కారోబార్ పవన్‌గా గుర్తింపు
- విధులు ముగించుకొని తిరిగి వాగులో గల్లంతైనా పవన్
- సింగరేణి NDR బృందం గాలింపు.. అర్ధరాత్రి మృతదేహం లభ్యం
తెలంగాణకు అవసరమైన సాయం: ప్రధాని మోదీ హామీ
- సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్
- రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్న ప్రధాని
- పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని ప్రధాని దృష్టి కి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి
- ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను.. తీసుకున్న జాగ్రత్తలను వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానికి వివరించిన సీఎం
- ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించిన ప్రధాని
- ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ
- కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందిస్తామన్న ప్రధాని
గుంటూరు
- సీఎం చంద్రబాబు నివాసం పరిసరాల్లో భయం భయం
- వెంకటపాలెం వద్ద కృష్ణానది ఉగ్రరూపం
- వెంకటపాలెం మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం వద్ద కృష్ణా నదిలో నుంచి కరకట్ట కిందగా వెంకటపాలెం వైపు వస్తున్న వరదనీరు
- కొన్ని దశాబ్దాల క్రితం పంట పొలాల్లో నీరు కృష్ణ నదిలోకి వెళ్లడానికి ఏర్పాటుచేసిన గేటు
- కృష్ణానది లో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో విరిగిపోయిన గేటు
- కరకట్ట కింది భాగం నుంచి విరిగిపోయిన గేటు ద్వారా వెంకటపాలెం వైపు వస్తున్న వరద నీరు
- భారీ స్థాయిలో తరలివచ్చిన వెంకటపాలెం గ్రామస్తులు
- ట్రాక్టర్లతో ఇసుక తెచ్చి తాత్కాలికంగా కరకట్టకు మరమ్మత్తులు చేస్తున్న గ్రామస్తులు
TS: పోటెత్తిన కృష్ణమ్మ
- ప్రకాశం బ్యారేజీకి 10.25 లక్షల క్యూసెక్కుల రాక
- సాగర్ వద్ద ఉధృతంగా వరద ప్రవాహం
- శ్రీశైలం నుంచి 4,74,205 క్యూసెక్కులు దిగువకు.. పులిచింతల నుంచి 6.75 లక్షల క్యూసెక్కుల విడుదల
విజయవాడ విలవిల
- వరదలో చిక్కుకొని 3.5 లక్షల మంది నరకయాతన
- వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్
- నిర్మాణంతో ఇప్పుడు లక్షల మందికి తప్పిన వరద ముప్పు
- వరద అంచనా, ముంపు నివారణ, సహాయ చర్యల్లో సర్కారు దారుణ వైఫల్యం
- బుడమేరు పొంగడంతో ఎన్టీటీపీఎస్‌ను ముంచెత్తిన వరద
- కృష్ణా వరద ఎగదన్నడంతో బుడమేరు కరకట్టలకు 10 చోట్ల గండ్లు
- కరకట్ట తెగిపోతుందనే భయంతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకుల ఎత్తివేత
- ముందస్తు సమాచారం లేకుండా నీటి విడుదలతో మునిగిన బెజవాడ
- కనీసం తాగునీరు అందక బాధితుల తీవ్ర అవస్థలు.. ఆహారం, మెడికల్
- క్యాంపులు లేవు.. అంతా అంధకారం.. కొరవడిన శాఖల మధ్య సమన్వయం
- విజయవాడలో 10 మంది మృతి, నలుగురు గల్లంతు
- అతి భారీ వర్షాలపై ముందే హెచ్చరించిన ఐఎండీ, సీడబ్ల్యూసీ
- అక్రమ నివాసంపై ప్రజల దృష్టి మళ్లించేందుకే బాబు అర్ధరాత్రి హడావుడి
తెలంగాణలో వర్షం విలయం
- భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 18 మంది మృతి
- పదుల సంఖ్యలో గల్లంతు
- పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు..
- జలాశయాల్లోకి చేరుతున్న నీరు
- ప్రధాన రహదారులపై వరదలతో స్తంభించిన ప్రజారవాణా
- అప్రమత్తమైన ప్రభుత్వం.. సహాయక చర్యలు ముమ్మరం.. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్
- పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం రేవంత్, మంత్రులు
- భారీ వర్షాలపై కేంద్రం ఆరా..
- సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు
- మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment