
సాక్షి, విశాఖపట్నం/ కాకినాడ సిటీ/కర్నూలు: నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై చురుగ్గా కొనసాగుతోంది. అదేవిధంగా తూర్పు పశ్చిమ షియర్ జోన్ 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ.ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.18, 19, 20 తేదీల్లో ఉత్తర కోస్తా, యానాం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది.
► గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని కోయిలకుంట్ల, పాకాల, డోర్నిపాడులో 4 సెం.మీ., గజపతినగరం, నల్లమల, రుద్రవరం, చెన్న కొత్తపల్లి, కలక్కడలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
► తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం 4.9 మి.మీ. సరాసరితో మొత్తం 312.4 మి.మీ. వర్షపాతం నమోదయింది. అత్యధికంగా అమలాపురం మండలంలో 22.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లాలో 19 మండలాల్లో వర్షాలు కురిశాయి. కోవెలకుంట్లలో అత్యధికంగా 39.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ నెలలో ఇప్పటికే 12 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment