విశాఖపట్నం : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. అల్పపీడన ద్రోణి మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమలో ఆదివారం, సోమవారం విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడన ద్రోణి
Published Sat, Nov 28 2015 9:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM
Advertisement