విశాఖపట్నం : తమిళనాడు తీరానికి సమీపంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. తమిళనాడు ప్రాంతంలో 3.5 కిలోమీటర్ల మేర ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని... అలాగే ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు పడతాయని తెలిపింది.
దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉత్తర దిశగా గాలులు వీస్తాయని పేర్కొంది. ఉత్తరకోస్తాలో చెదురుమదురు వర్షాలు పడతాయని చెప్పింది. అయితే దక్షిణ కోస్తాలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.