మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు | Heavy rains in telugu states within 24 hours, says visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

Published Thu, Jun 18 2015 9:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

విశాఖపట్నం: మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర అనుకోని అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని పేర్కొంది.

అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కుదులుతుందని చెప్పింది. దీంతొ కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement