వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.
విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అది పశ్చిమబెంగాల్ వైపు బలపడుతుందని తెలిపింది. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు తీరం మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని వివరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావారణ కేంద్రం తెలిపింది.