విశాఖపట్నం : విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. రాగల 48 గంటల్లో తెలంగాణలో వర్షాలు విస్తారంగా పడతాయని తెలిపింది. కోస్తాంధ్రలో మాత్రం అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది.