రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
విశాఖపట్నం: ఉత్తర కోస్తా, దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణకు అనుకుని తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రాంతంలో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తా, తెలంగాణలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 -50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.