నేడు, రేపు కోస్తాంధ్రలో వర్షాలు | Moderate Rains In Coastal Andhra For Coming 2 days | Sakshi
Sakshi News home page

నేడు, రేపు కోస్తాంధ్రలో వర్షాలు

Published Thu, Aug 6 2020 4:17 AM | Last Updated on Thu, Aug 6 2020 4:44 AM

Moderate Rains In Coastal Andhra For Coming 2 days - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అల్పపీడన ప్రభావంతో గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది.

► ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్‌ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.
► కోస్తా తీరం వెంట గంటకు 50 నుంచి 60 కి.మీ వేగం గాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. రెండు రోజులపాటు కోస్తా తీర ప్రాంత మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
► గత 24 గంటల్లో వర రామచంద్రాపురంలో 6 సెం.మీ, పోలవరం, పాడేరుల్లో 5, ప్రత్తిపాడు, పెద్దాపురంల్లో 4, చింతపల్లి, కుక్కునూరు, అమలాపురం, తాడేపల్లిగూడెం, కూనవరం, భీమడోలుల్లో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement