విశాఖపట్నం : నైరుతి రుతుపవనాలు మందకొడిగా ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద రుతుపవనాలు నిలకడగా ఉన్నాయని పేర్కొంది. ప్రతికూల వాతావరణంతోనే రుతుపవనాల్లో కదలిక లేదని స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, తెలంగాణలో ఈ రుతుపవనాలు విస్తరించడానికి మరో 2 లేదా 3 రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపింది.
24 గంటల్లో ఏపీ, తెలంగాణలో క్యూములోనింబస్ మేఘాలు ప్రభావంతో వర్షాలు పడతాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.