విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తీరాలను ఈ అల్పపీడనం ఆనుకుని ఉందని తెలిపింది. అలాగే అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఒడిశా, కోస్తాంధ్ర మీదగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని చెప్పింది.
ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని.... కోస్తా తీరం వెంబడి గంటకు 45 - 50 కి.మీ. వేగంలో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.