ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ రెండో తేదీన మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 31, సెప్టెంబర్ 1,2 తేదీల్లో కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఐఎండీ వెల్లడించింది. కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడా తేలిక పాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment