బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది.
విశాఖపట్నం : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరిత అవర్తనం ఏర్పడిందని తెలిపింది. మరో 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే రాగల 24 గంటల్లో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది.