విశాఖపట్నం : ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ మీదగా అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సదరు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అయితే కొన్ని చోట్ల మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని చెప్పింది. అలాగే దక్షిణ కోస్తాతీరం వెంబడి 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.