విశాఖపట్నం: దక్షిణ కోస్తాని అనుకుని అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఆ అల్పపీడనం మరికొద్ది గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో దక్షిణకోస్తాలో ఈ రోజు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అలాగే ఉత్తరకోస్తాలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని... కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 - 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని వెల్లడించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది.