
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన వేళ.. ఈశాన్య గాలుల ప్రభావం రాష్ట్రంలో మొదలైంది. పలుచోట్ల చలి ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత మొదలైంది. ఆరోగ్యవరంలో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 కి.మీ. ఎత్తు వద్ద నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతోంది.
అదేవిధంగా తూర్పు బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాల్లో 1.5 కి.మీ. నుంచి 4.5 కి.మీ. మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment