ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగ్లాదేశ్ సమీపంలోని 9 కి.మీ ఎత్తున్న ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. అల్పపీడనం ఏర్పడితే రుతుపవనాల ప్రభావానికి అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ వివరించింది.