విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.