విశాఖపట్నం : ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను అనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణకోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి ఆవరించి ఉందని పేర్కొంది.ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరకోస్తాలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది.