విశాఖపట్నం: మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి అవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది.
దాంతో రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఈ రోజు సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.