telangana and andhra pradesh
-
TS/AP: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణకు కొత్త రైల్వే ప్రాజెక్ట్‌లకు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. మంజూరైన కేంద్ర ప్రాజెక్టుల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌కు భూమి అడిగాం. భూమి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. చర్లపల్లి కనెక్టివిటీ రోడ్‌కు కూడా రాష్ట్రం స్పందించట్లేదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 2024లో ప్రారంభిస్తాం. యాదాద్రి ఎంఎంటీస్‌తో సహా పలు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. త్వరలో సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కొత్త రైల్వేలైన్లు ఇవే.. ► ఆదిలాబాద్ నుంచి పటాన్చెరువు వరకు కొత్త రైల్వేలైన్. ► వరంగల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వేలైన్. ► ఉందానగర్ నుంచి జగ్గయ్యపేట వరకు కొత్త రైల్వేలైన్. ► వికారాబాద్-కృష్ణా మధ్య కొత్త రైల్వేలైన్. ► ఆర్ఆర్ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్. ఇది కూడా చదవండి: టార్గెట్ కడియం.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్ -
రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు
విశాఖపట్నం: మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి అవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దాంతో రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఈ రోజు సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.