తమిళనాడులోని నాగపట్నానికి 620 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. వాయుగుండం నాగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే సముద్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. దాంతో మత్య్సకారులను అధికారులు అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ నౌకాశ్రయాల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.