విశాఖపట్నం : మరో రెండు లేదా మూడు రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది.
అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.