విశాఖపట్నం: ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ..దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్సపీడన ద్రోణి ఏర్పడినట్టు విశాఖలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ప్రస్తుతం కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్ర్రాలలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు చోట్లు భారీ వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు.