జార్ఖండ్ నుంచి ఒడిశా... కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది.
విశాఖపట్నం: జార్ఖండ్ నుంచి ఒడిశా... కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో కొన్నిచోట్లు ఉరుములతో కూడిన జల్లులు లేదా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. అవి ఈ నెల 5వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది.