సాక్షి, హైదరాబాద్ : ఉత్తర కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే గల్ఫ్ ఆఫ్ మార్ట్ బాన్ నుంచి దక్షిణ కోమోరిన్, మాల్దీవుల ప్రాంతం వరకు షియర్ జోన్ ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే సోమవారం ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇదిలా వుండగా శనివారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. అనేకచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. నల్లగొండలో అత్యధికంగా 42 డిగ్రీలు నమోదు కాగా, ఆదిలాబాద్, ఖమ్మంల్లో 41 డిగ్రీలు, హైదరాబాద్‌లో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment