ఈ ఏడాది సాధారణ వర్షపాతం..
రాయలసీమలో స్వల్ప తగ్గుదల
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవనుండగా, రాయలసీమలో స్వల్ప తగ్గుదల ఉండనుంది. అసోచామ్ - స్కైమెట్ వాతావరణ నివేదికలో ఈ మేరకు వెల్లడైంది. అకాల వర్షాల వల్ల రబీ పంట నష్టం కొనసాగుతుందని, ఉత్తర భారత్‌లో ఏప్రిల్ తొలి వారంలో వర్షాలు పడే అవకాశముందని నివేదికలో పేర్కొన్నారు. రాయలసీమతోపాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, దక్షిణ లోతట్టు కర్ణాటక, ఉత్తర తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో వర్షపాతంలో స్వల్ప తగ్గుదల నమోదవుతుందని తెలిపారు. సాగవుతున్న మొత్తంలో వర్షాలపై ఆధారపడి సాగు చేస్తున్న భూమి 60 శాతం ఉంది.