న్యూఢిల్లీ: ఫసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడినప్పటికీ వాయవ్య భారత్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే జూన్ నెలలో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులుంటాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక, ఉత్తర తమిళనాడు, రాజస్తాన్, లద్దాఖ్ మినహా మిగిలిన ప్రాంతాల్లో జూన్ నెలలో వానలు అంతగా కురిసే అవకాశాల్లేవని అంచనా వేసింది.
ఫసిఫిక్ మహా సముద్రం వేడెక్కడం ఇప్పటికే ప్రారంభమైందని మన రుతుపవనాలపై ప్రభావాన్ని చూపిస్తే ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం 90శాతం ఉందని కేంద్ర వాతావరణ శాఖ పర్యావరణ పర్యవేక్షణ అధ్యయన కేంద్రం చీఫ్ డి. శివానంద చెప్పారు. అయితే వానలు కురవడానికి అనుకూలమైన ఇండియన్ ఓషన్ డిపోల్ (ఐఓడీ) హిందూ మహాసముద్రంలో ఏర్పడడం వల్ల చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. మధ్య భారతదేశంపై ఎల్‌నినో ప్రభావాన్ని ఐఓడీ సమర్థంగా ఎదు ర్కోవడం వల్ల ఏడాది మొత్తమ్మీద సాధారణ వర్షపాతం కురుస్తుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment