
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 30నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా శుక్ర, శనివారాల్లో కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment