నేడు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా మహారాష్ట్రలోని 11 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం 11 గంటలకు 17.5 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న లోక్‌సభ స్థానాల్లో జాల్నా సీటుపై అందరి దృష్టి నిలిచింది. ఈ స్థానం నుంచి మొత్తం 26 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు.
మహారాష్ట్రలోని జాల్నా లోక్‌సభ నియోజకవర్గాన్ని 1999 నుంచి బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఈ స్థానంలో ప్రస్తుతం రావ్‌సాహెబ్ దాన్వే ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఆయనే బీజేపీ తరపున ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి కల్యాణ్ కాలే ఎన్నికల బరిలో దిగారు. వంచిత్ బహుజన్ అఘాడీ తన అభ్యర్థిగా ప్రభాకర్ దేవ్‌గన్‌ను రంగంలోకి దించింది.
మహారాష్ట్రలో ఈరోజు (సోమవారం) 11 లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతుండగా, వాటిలో ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా, పశ్చమ మహారాష్ట్ర ప్రాంతాలు ఉన్నాయి. ఈ నాల్గవ దశ పోలింగ్‌లో 2 కోట్ల 28 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 298 మంది అభ్యర్థులు నాల్గవ దశ లోక్‌సభ ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment