జిల్లాలో 40 శాతం సాధికార సర్వే పూర్తి : జేసీ
రంగంపేట : జిల్లాలో 40 శాతం సాధికార సర్వే పూర్తయిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో జిల్లాలోని అన్ని మండల అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,800 మంది సిబ్బంది స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. 17 లక్షల కుటుంబాలకు గాను, ఇప్పటి వరకూ 6 లక్షల 13 వేల కుటుంబాల సర్వే పూర్తి చేశారని తెలిపారు. నెల రోజుల్లోగా ఈ సర్వే పూర్తి చేస్తామన్నారు. సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఎంపీడీఓ కె.కిషోర్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ ఎం.సూర్య ప్రభ తదితరులు పాల్గొన్నారు.