credit growth
-
ఈసారి 15 శాతం రుణ వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆరి్థక వృద్ధి రేటును బట్టి చూస్తే ఈ ఆరి్థక సంవత్సరంలో (2024–25) రుణాల వృద్ధి 14–15 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. ‘సాధారణంగా జీడీపీ వృద్ధి రేటుకు ద్రవ్యోల్బణాన్ని కలిపి, దానికి 2–3 శాతం అదనంగా రుణ వృద్ధి ఉండగలదని అంచనా వేస్తుంటాం. దానికి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలను బట్టి ఇది 14–15 శాతం ఉండొచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇక డిపాజిట్ల విషయానికొస్తే గతేడాది 11 శాతం వృద్ధి నమోదైనట్లు చెప్పారు. ఈసారి 12–13 శాతం స్థాయిలో ఉండగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ చట్టబద్ధ లిక్విడిటీ నిష్పత్తి (ఎస్ఎల్ఆర్) నిర్దేశిత స్థాయికన్నా అధికంగానే ఉన్నందున డిపాజిట్ల రేట్లను పెంచి మరీ నిధులు సమీకరించాల్సిన ఒత్తిళ్లేమీ లేవని ఖారా వివరించారు. -
2023-24లో రుణ వృద్ధి 10 శాతమే: నోమురా అంచనా
ముంబై: భారత్‌లో రుణ వృద్ధి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పరిమితం కావచ్చని జపాన్ బ్రోకరేజ్ సంస్థ-నోమురా అంచనా వేసింది. 2022-23లో సాధించిన 15 శాతంతో పోల్చిచూస్తే రుణ స్పీడ్ దాదాపు 5 శాతం పడిపోతు దన్నది నోమురా అంచనాలు కావడం గమనార్హం. ఆహారేతర రుణాలకు సంబంధించి వృద్ధి మందగించే అవకాశం ఉందని ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో సంస్థ అభిప్రాయపడింది. (ఇదీ చదవండి: బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) రుణ వృద్ధి స్పీడ్ తగ్గడంసహా, ద్రవ్యోల్బణం ఒత్తిడులు, తక్కువ మూలధన అవసరాలు వంటి కారణాలు 2023-24లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రేటును 5.3 శాతానికి పరిమితం చేస్తాయని కూడా నోమురా అంచనా వేయడం గమనార్హం. గత ఏడాది మే నుంచి 2.5 శాతం మేర పెరిగిన ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.5 శాతం) రుణ వృద్ధికి విఘాతం కలిగించే వీలుందని, వ్యవస్థలో ప్రత్యేకించి గృహ రుణాలపై ఇప్పటికే ఈ సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషించింది. (డిజిటల్ బాటలో ఎయిర్ ఇండియా - భారీ పెట్టుబడి) జనవరిలో 16.7 శాతం రుణ వృద్ధి నమోదయితే.. ఇది తగ్గుతూ వస్తున్న ధోరణి స్పష్టమవుతోందని పేర్కొంది. ఫిబ్రవరిలో 16 శాతం, మార్చిలో 15.4 శాతంగా రుణ వృద్ధి జరిగిందని పేర్కొంది. రానున్న మాసాల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. రుణ వృద్ధి పెంచుకోవవడం-సాధ్యమైనంత మొండిబకాయిలు (ఎన్పీఏ) తగ్గించుకోవడంపై భారత్ బ్యాంకింగ్ ప్రస్తుతం దృష్టి సారించినట్లు పరిస్థితి కనబడుతోందని పేర్కొంది. (శ్యామ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్టాల్లో మరింత విస్తరణ) -
పటిష్ట బాటన భారత్ ఎకానమీ..!
ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 14.2 శాతం నమోదయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి. 2021 ఇదే కాలంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 6 శాతం. గడచిన త్రైమాసికం (2022 జనవరి–మార్చి)లో ఈ రేటు 10.8 శాతంగా ఉంది. ఎకానమీ పురోగమన బాటలో ఉందనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ మే నెల నుంచి ఆగస్టు వరకూ 1.40 (ప్రస్తుతం 5.40 శాతం) పెంచింది. ఇందులో జూన్ వరకూ పెరిగిందే 90 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం). ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్‌సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించింది. అయినప్పటికీ పటిష్ట స్థాయిలో రుణ వృద్ధి రేటు నమోదుకావడాన్ని చూస్తే, వ్యవస్థలో డిమాండ్ పరిస్థితులు బాగున్నాయని స్పష్టమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘జూన్ త్రైమాసిక రుణ, డిపాజిట్ వృద్ధి 2022’ శీర్షికన ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులుసహా అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల నుంచి సమీకరించిన సమాచారం ఆధారంగా తాజా గణాంకాలు రూపొందాయి. ► దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రాతిపదికన రుణ వృద్ధి నమోదయ్యింది. ► గడచిన ఐదు త్రైమాసికాల్లో డిపాజిట్ వృద్ధి రేటు 9.5 శాతం నుంచి 10.2 శాతం శ్రేణిలో ఉంది. ► జూన్ త్రైమాసికంలోని దేశ వ్యాప్తంగా మొత్తం డిపాజిట్లలో కరెంట్, సేవింగ్స అకౌంట్ (సీఏఎస్ఏ) నిష్పత్తి 73.5 శాతం. గత ఏడాది ఇదే సమయంలో ఈ నిష్పత్తి 70.5 శాతం. ఒక్క మొట్రోపాలిటన్ బ్రాంచీల్లో ఈ నిష్పత్తి వార్షికంగా చూస్తే 84.3 శాతం నుంచి 86.2 శాతానికి పెరిగింది. లిస్టెడ్ ప్రైవేటు కంపెనీల అమ్మకాలు 41 శాతం అప్ కాగా లిస్టెడ్ నాన్–ఫైనాన్స్ ప్రైవేటు కంపెనీల అమ్మకాలు జూన్ త్రైమాసికంలో 41 శాతం పెరిగి రూ.14.11 కోట్లుగా నమోదయినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. 2021 ఇదే కాలంలో ఈ అమ్మకాల్లో 60.6 శాతం వృద్ధి నమోదుకాగా, 2022 జనవరి–మార్చిలో ఈ రేటు 22.3 శాతంగా ఉంది. -
ఖాతాదారులకు భారీ షాక్, రుణాలపై స్పందించిన ఎస్బీఐ చైర్మన్ ఖారా!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల (అర శాతం) వరకూ పెంచింది. దీంతో రుణగ్రహీతలు నెలవారీగా చెల్లించే వాయిదాల (ఈఎంఐ) భారం మరింత పెరగనుంది. కొత్త రేట్లు ఆగస్టు 15 నుంచి వర్తిస్తాయని బ్యాంకు వెల్లడించింది. ఈ సందర్భంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ రిటైల్, కార్పొరేట్ లోన్లకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం మేర రుణ వృద్ధిని సాధించగలమని అంచనా వేస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రుణాల వృద్ధి గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే రూ.25,23,793 కోట్ల నుంచి 14.93 శాతం పెరిగి రూ.29,00,636 కోట్లకు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో రిటైల్ రుణాలు సుమారు 19 శాతం, కార్పొరేట్ రుణాలు 11 శాతం మేర పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ రుణాలు రూ.2.5–3 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని, చిన్న.. మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) నుంచి కూడా రుణాలకు డిమాండ్ నెలకొందని ఖరా వివరించారు. త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లతో యోనో 2.0 యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు విశ్లేషకులతో సమావేశంలో ఆయన తెలిపారు. యోనోలో ఇప్పటివరకూ నమోదు చేసుకున్న వారి సంఖ్య 5.25 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. కొత్త సేవింగ్స్ ఖాతాల్లో 65 శాతం అకౌంట్లను యోనో ద్వారానే తెరుస్తున్నట్లు ఖారా వివరించారు. ప్రభుత్వాలు భారీగా టీకాల కార్యక్రమం నిర్వహించడంతో కరోనా మహమ్మారి చాలా మటుకు అదుపులోకి వచ్చిందని..ఆంక్షల తొలగింపుతో ఎకానమీ మెరుగుపడుతోందని ఆయన చెప్పారు. చదవండి👉 ఎస్బీఐ:'హాయ్' చెప్పండి..వాట్సాప్‌లో బ్యాంక్ సేవల్ని పొందండి! -
బ్యాంకింగ్ రుణ వృద్ధి 6.7 శాతం
ముంబై: భారత్ బ్యాంకింగ్ రుణ వృద్ధి 2021 సెప్టెంబర్ 10వ తేదీతో ముగిసిన పక్షం రోజులకు (2020 ఇదే కాలం వద్ద ఉన్న విలువతో పోల్చి) 6.7 శాతం పెరిగి రూ.109.12 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇక డిపాజిట్ల విలువ 9.32 శాతం పెరిగి రూ.155.75 లక్షల కోట్లుగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2020 సెప్టెంబర్ 11తో ముగిసిన పక్షం రోజులకు బ్యాంకింగ్ రుణవిలువ రూ.102. 27 లక్షల కోట్లుకాగా, డిపాజిట్ల విలువ రూ.142.47 లక్షల కోట్లని ఆర్బీఐ షెడ్యూల్డ్ బ్యాంక్స్ స్టేట్మెంట్ పేర్కొంది. కాగా 2021 ఆగస్టు 27తో ముగిసిన పక్షం రోజుల్లో రుణ వృద్ధి 6.67 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి 9.45 శాతం. అంటే సమీక్షించిన పక్షం రోజుల వ్యవధిలో రుణ వృద్ధి రేటు స్వల్పంగానై పెరగడం (6.67 శాతం నుంచి 6.7 శాతానికి) కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం. గత ఆర్థిక సంవత్సరం ఇలా... ఆర్బీఐ గణాంకాల ప్రకారం, 2020–21లో బ్యాంక్ రుణ వృద్ధి కేవలం 5.56 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి రేటు 11.4 శాతం. కరెంట్, సేవింగ్స్ అకౌంట్స్ (కాసా) డిపాజిట్లు భారీగా పెరగడం వల్ల డిపాజిట్లలో భారీ వృద్ధి (2019–2020లో 8.8 శాతం వృద్ధి)కి కారణమని గణాంకాలు వెల్లడించాయి. ఒక్క 2021 మార్చిలోనే కాసా డిపాజిట్లు 43.7 శాతం పెరగడం గమనార్హం. డిపాజిట్లలో గృహ రంగం వాటా 64.1శాతం. ఇందులో వ్యక్తులు,హిందూ అవిభక్త కుటుంబాల వాటానే 55.8 శాతం. నాన్–ఫైనాన్షియల్ కార్పొరేషన్ల వాటా 18.8 శాతం. కేంద్రం ప్రత్యేక దృష్టి రుణ వృద్ధి, తద్వారా ఎకానమీ పురోగతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యయాల వల్ల 2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 8.9 శాతంగా ఉంటుందన్న రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అంచనావేస్తోంది. ప్రభుత్వ వ్యయాలు ప్రత్యేకించి మౌలిక రంగంలోకి వెళుతున్న పెట్టుబడులు, రిటైల్ రుణాలకు డిమాండ్ పునరుద్దరణ వంటి అంశాలు దీనికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. రుణాలకు డిమాండ్‌లేదని ఇప్పుడే ప్రకటించడం తొందరపాటు చర్య అవుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పేర్కొన్నారు. రుణ వృద్ధికి బ్యాంకింగ్ అక్టోబర్ నుంచీ జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. ‘‘మహమ్మారి కరోనా ప్రారంభం నుంచీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొనడానికి కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఈ ఉద్దీపన ప్యాకేజీలు సత్ఫలితాలు ఇవ్వడంలో రుణ వృద్ధి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అక్టోబర్ నుంచీ చేపట్టనున్న జిల్లాల వారీ చర్యలు రుణ వృద్ధికి ఊపునిస్తాయి’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. రుణ వృద్ధికి ఊపునందించడానికి 2019లో సైతం బ్యాంకులు 400 జిల్లాల్లో ‘‘రుణ మేళా’’లను నిర్వహించిన సంగతి తెలిసిందే. -
బ్యాంకింగ్ రుణ వృద్ధి 6.55 శాతం
ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి ఆగస్టు 13వ తేదీతో ముగిసిన పక్షం రోజులకు 6.55 శాతంగా నమోదయ్యింది. డిపాజిట్ల విషయంలో ఈ వృద్ధి 10.58 శాతంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. వివరాలు చూస్తే... 2020 ఆగస్టు 14 నాటికి రుణ మంజూరు పరిమాణం రూ.102.19 లక్షల కోట్లు. 2021 ఆగస్టు 13 నాటికి ఈ విలువ రూ.108.89 లక్షల కోట్లకు చేరింది. అంటే రుణ వృద్ధి 6.55 శాతమన్నమాట. చదవండి : రూపాయి.. అధరహో ►ఇక డిపాజిట్ల విలువ ఇదే కాలంలో రూ.140.80 లక్షల కోట్ల నుంచి రూ.155.70 లక్షల కోట్లకు చేరింది. ► 2021 జూలై 30వ తేదీ నాటికి అందిన షెడ్యూల్డ్ బ్యాంకుల స్టేట్మెంట్ల ఆధారంగా ఈ గణాంకాలు వెలువడ్డాయి. ►సమీక్షా పక్షానికి ముందు ముగిసిన పక్షం రోజుల్లో (2021 జూలై 30) రుణ వృద్ధి రేటు 6.11 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి రేటు 9.8 శాతంగా ఉంది. ►2020–21 ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 5.56 శాతంగా ఉంటే, డిపాజిట్ల వృద్ధి రేటు 11.4 శాతంగా నమోదయ్యింది. ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో సమావేశమైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అనంతరం మాట్లాడుతూ, రుణాలకు డిమాండ్‌లేదని ఇప్పుడే ప్రకటించడం తొందరపాటు చర్య అవుతుందని పేర్కొన్నారు. రుణ వృద్ధికి బ్యాంకింగ్ అక్టోబర్ నుంచీ జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. మహమ్మారి కరోనా ప్రారంభం నుంచీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొనడానికి కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తోందని,ఈ ఉద్దీపన ప్యాకేజీలు సత్ఫలితాలు ఇవ్వడంలో రుణ వృద్ధి కూడా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అక్టోబర్ నుంచీ రుణ వృద్ధికి బ్యాంకులు జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు కూడా వెల్లడించారు. రుణ వృద్ధికి ఊపునందించడానికి 2019లో సైతం బ్యాంకులు 400 జిల్లాల్లో రుణ మేళాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. -
వారం రోజుల వ్యవధిలో 6.11 శాతం పెరిగిన బ్యాంకింగ్ రుణ వృద్ధి
ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి 2021 జూలై 30 తేదీతో ముగిసిన పక్షం రోజులకు (జూలై 31, 2020తో పోల్చి) 6.11 శాతం పెరిగింది. విలువలో ఇది రూ.102.82 లక్షల కోట్ల నుంచి రూ.109.1 లక్షల కోట్లకు చేరింది. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇదే కాలంలో డిపాజిట్ల రేటు 9.8 శాతం పెరిగి 141.61 లక్షల కోట్ల నుంచి రూ.155.49 లక్షల కోట్లకు ఎగసింది. 2021 జూలైతో ముగిసిన పక్షం రోజుల్లో రుణ వృద్ధి రేటు 6.45 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి రేటు 10.65 శాతం. గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) బ్యాంక్ రుణ వృద్ధి 5.56 శాతం. డిపాజిట్ల వృద్ధి 11.4 శాతం. -
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కష్టకాలం!
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ) రుణాల వృద్ధి అవకాశాలను లిక్విడిటీ సంక్షోభం దెబ్బతీసిందని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2019–20) కూడా ఈ పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా బలహీన మార్కెట్ పరిస్థితులు సైతం హెచ్ఎఫ్సీ ఆస్తుల నాణ్యతపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెచ్ఎఫ్సీలు 13–15 శాతం మధ్య రుణాల వృద్ధిని నమోదు చేస్తాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం 2019–20లో ఇది 14–16 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొంది. బలహీన నిర్వహణ పరిస్థితుల కారణంగా ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి ఉంటుందని అంచనా వేసింది. ఇళ్ల రుణాల విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) ప్రస్తుతమున్న 1 శాతం నుంచి మధ్య కాలానికి 1.3 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. ప్రాజెక్టు రుణాలను కూడా కలిపి చూస్తే మొత్తం మీద హెచ్ఎఫ్సీల ఎన్పీఏలు 1.4 శాతం నుంచి 1.8 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది. ఈ పరిస్థితుల కారణంగా గతేడాది 18 శాతంగా ఉన్న మార్జిన్లు 14 శాతానికి పరిమితమవుతాయని అభిప్రాయపడింది. 2020 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలోనే ఉండొచ్చని పేర్కొంది. గత కొన్నేళ్లుగా మోర్ట్గేజ్ ఫైనాన్స్‌ను ఎన్బీఎఫ్సీలు సురక్షితంగా భావించడం జరిగిందని, ప్రధానంగా ఈ విభాగం నిద్రాణంగా ఉండడం వల్లేనని గుర్తు చేసింది. 2018 సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ దివాలా తీయడం ఫలితంగా ఈ రంగంలో నిధుల సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి తగ్గుముఖం పట్టడంతో బ్యాంకులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయని ఇక్రా వివరించింది. ఇళ్ల రుణాల పోర్ట్‌ఫోలియో హెచ్ఎఫ్సీలకు, ఇతర రుణదాతులకు 18 శాతం నుంచి 13 శాతానికి దిగొచ్చినట్టు తెలిపింది. ఊహించని మార్కెట్ సంక్షోభాలను ఎదురైతే ఎదుర్కొనేందుకు హెచ్ఎఫ్సీలు నిధుల నిల్వలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాయని తన నివేదికలో పేర్కొంది. -
రుణ వృద్ధికి ఆ నిధులు సరిపోవు!
ముంబై: కేంద్ర ప్రభుత్వం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2017 అక్టోబర్‌లో ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్లు బ్యాంకింగ్ రుణ వృద్ధికి ఎంతమాత్రం సరిపోవని మూడీస్ పేర్కొంది. ఇది కేవలం రెగ్యులేటరీ (నియంత్రణా పరమైన) మూలధన అవసరాలకు తగిన మొత్తమేనని విశ్లేషించింది. 2017–18, 2018–19లకు సంబంధించి బ్యాంకులకు కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల తాజా మూలధనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ ఏడాది బడ్జెట్లో రూ. 65,000 కోట్లు కేటాయించింది. ఈ అంశాలపై మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ అల్కా అంబరసు అభిప్రాయాల్లో ముఖ్యమైనవి చూస్తే... ళి ప్రభుత్వ రంగ బ్యాంకులు మూలధన కొరతను ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ నుంచి అదనపు క్యాపిటల్‌ను బ్యాంకింగ్ సమీకరించుకోలేకపోవడం దీనికి కారణం. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ ధరలు దాదాపు 19 శాతం తగ్గాయి. ►కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల ప్యాకేజ్ని ప్రకటిస్తున్న సమయంలో బ్యాంకులు కూడా ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.58,000 కోట్లు సమీకరించుకోగలవన్న అంచనాతో ఉంది. అయితే ఇప్పటి వరకూ దాదాపు రూ.10,000 కోట్లు మాత్రమే సమీకరించుకోగలిగాయి. ► అంతర్గత మూలధన సృష్టి సామర్థ్యం ప్రభుత్వ రంగ బ్యాంకులకు గణనీయంగా పడిపోయింది. వాటి బలహీన ఫైనాన్షియల్ పరిస్థితులు దీనికి కారణం. ఇక మరోవైపు ప్రభుత్వ బాండ్ ఈల్డ్ పెరగడం బ్యాంకుల పెట్టుబడుల ఆదాయంపై ప్రభావం చూపుతోంది. ఆయా అంశాలన్నీ దీర్ఘకాలంలో బ్యాంకింగ్ మూల«ధన సమస్యలు సృష్టించేవే. భారత్ వ్యయాల తగ్గింపు తప్పదు.. ఇదిలావుండగా, ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పిత్తి (2018–19)లో 3.3 శాతానికి కట్టడి చేయడం కేంద్రానికి కీలకమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఇందుకుగాను వ్యయాలను తగ్గించే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది. ‘అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో ఉన్న చమురు ధరల నేపథ్యంలో, పెట్రోలియం, డీజిల్ ప్రొడక్ట్స్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే ఇబ్బందే. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు తగ్గుతాయి. ద్రవ్యలోటు పెరుగుతుంది. ఇది దేశ సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఒత్తిడి తెచ్చే అంశం’’ అని మూడీస్ విశ్లేషించింది. మూడీస్ గత ఏడాది 13 యేళ్లలో మొట్టమొదటిసారి భారత్ సావరిన్ రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ2’కు పెంచిన సంగతి తెలిసిందే. పీఎస్‌బీల చీఫ్‌లతో నేడు కేంద్రం భేటీ న్యూఢిల్లీ: పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ శుక్రవారం సమావేశం కానున్నారు. ఆయా బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. ముంబైలో జరిగే ఈ సమావేశాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు ప్రాంతాలకు చెందిన పీఎస్బీలకు సంబంధించి 15 మంది సీఈవోలు దీనికి హాజరు కానున్నారు. 2017–18 ఆర్థిక ఫలితాలు వెల్లడైన తర్వాత పీఎస్‌బీల చీఫ్‌లతో కేంద్రం సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరం చాలా మటుకు బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొండిబాకీల పరిష్కారానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలో మొత్తం 11 బ్యాంకులు ఉన్నాయి. ఇందులో 7 బ్యాంకులు పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలకు చెందినవే. ఆర్బీఐ వాచ్‌లిస్ట్‌లో అలహాబాద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి. నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నాలుగో త్రైమాసికంలో ఏకంగా రూ. 13,417 కోట్లు నష్టం ప్రకటించింది. కుంభకోణానికి సంబంధించిన రూ. 14,356 కోట్ల మొత్తంలో సుమారు సగభాగం .. అంటే రూ. 7,178 కోట్లకు పీఎన్బీ ప్రొవిజనింగ్ చేసింది. మిగిలిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు త్రైమాసికాల్లో సర్దుబాటు చేయనుంది. మరోవైపు, ఎస్బీఐ సైతం జనవరి–మార్చి త్రైమాసికంలో రూ. 7,718 కోట్ల నష్టం నమోదు చేసింది. అంతక్రితం ఏడాది నాలుగో త్రైమాసికంలో నమోదైన రూ. 3,442 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు. -
రుణ వృద్ధి 8 శాతమే: అసోచామ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు ఎనిమిది శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అసోచామ్ అధ్యయనం ఒకటి పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం, ఇప్పటికే మొండి బకాయిల సమస్యతో సతమతం అవుతున్న బ్యాంకింగ్ వంటి అంశాలు రుణ వృద్ధి మందగమనానికి ప్రధాన కారణంగా విశ్లేషించింది. 2017 మా ర్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆహారేతర వి భాగ రుణ వృద్ధి కేవలం 5.1 శాతం. ఇది 50 సంవత్సరాల కనిష్టస్థాయి. అయితే తాజా అధ్యయనం ప్రకారం– ఈ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొంత మెరుగుపడుతుండడం కొంత ఆశావహ పరిణామం. రిటైల్, వ్యవసాయ రంగాల నుంచి రుణ డిమాండ్ కొంత మెరుగుపడుతుండడం దీనికి కారణం. -
జీడీపీ– రుణ వృద్ధి మధ్య పెరిగిన వ్యత్యాసం: ఎస్బీఐ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), రుణ వృద్ధి రేటు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోయిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డైరెక్టర్ రజనీష్ కుమార్ ఇక్కడ విలేకరులతో అన్నారు. రుణ వృద్ధి 2016–17 ఆర్థిక సంవత్సరంలో దాదాపు అరవై సంవత్సరాల కనిష్ట స్థాయి (1953–54లో 1.7 శాతం) 5.08 శాతానికి పడిపోతే, జీడీపీ వృద్ధి మాత్రం 7 శాతంగా నమోదవడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంతక్రితం జీడీపీ వృద్ధి రేటు 7 శాతం ఉంటే, రుణ వృద్ధి రేటు సహజంగా 14 నుంచి 15 శాతంగా ఉండేదని ఆయన అన్నారు. గృహ, ఆటో, వ్యక్తిగత రుణాల తీరు బాగున్నప్పటికీ, కార్పొరేట్ రుణ, ప్రాజెక్ట్ ఫైనాన్స్ విభాగాలు మాత్ర నిరుత్సాహంగా ఉన్నట్లు సీనియర్ బ్యాంకింగ్ అధికారి తెలిపారు. అంతక్రితం ఆయన ఇక్కడ ఎస్బీఐ ఏర్పాటు, తొలినాళ్లకు సంబంధిత ఒక ఫొటో గ్యాలరీని ఆవిష్కరించారు. -
60 ఏళ్ల కనిష్టానికి రుణ వృద్ధి
ముంబై: అధిక స్థాయిలో మొండి బకాయిలు, కార్పొరేట్ డిమాండ్ బలహీనంగా ఉండడం వంటి పలు అంశాల కారణంగా రుణాల వృద్ధి 60 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 5.08 శాతంగా నమోదైంది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 10.7 శాతంగా ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2016 ఏప్రిల్ 1 నాటికి బ్యాంకులు జారీ చేసిన రుణాలు రూ.75.01 లక్షల కోట్లుగా ఉండగా, అవి 2017 మార్చి చివరి నాటికి రూ.78.81 లక్షల కోట్లకు చేరాయి. వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం, వృద్ధి రేటు 7 శాతానికి సమీపంలో ఉన్న తరుణంలో తాజా గణాంకాలు ఆశ్చర్యపరిచేవేనని నిపుణులు పేర్కొంటున్నారు. కంపెనీలు రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించడం తగ్గి, బాండ్ మార్కెట్ నుంచి నిధుల సమీకరణ పెరగడం ఇందుకు ఓ ముఖ్య కారణంగా చెబుతున్నారు. రుణాల వృద్ధి 1953–54లో అతి తక్కువగా 1.7 శాతమే నమోదు కాగా, ఆ తర్వాత ఇంత తక్కువ వృద్ధి నమోదు కావడం గత ఆర్థిక ఏడాదిలోనే. తాజా మొండి బకాయిల (ఎన్పీఏ) నమోదు రేటు సాధారణ స్థాయికి చేరుకుంటున్నా బ్యాంకింగ్ రంగ ఆస్తుల నాణ్యత బలహీనంగా కనిపిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. -
రుణ వృద్ధిపై ఎన్డీబీ దృష్టి: కామత్
దావోస్: బ్రిక్ దేశాల నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) రుణ వృద్ధిపై దృష్టి సారిస్తోంది. వచ్చే రెండు మూడేళ్లూ... ప్రతి ఏడాదీ తన రుణాన్ని రెట్టింపు చేసుకోవడంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బ్యాంక్ ప్రెసిడెంట్ కేవీ కామత్ తెలిపారు. తన 10 బిలియన్ డాలర్ల మూలధనాన్ని వినియోగించుకుని బ్యాంక్ మొదటి 6 నుంచి 7 సంవత్సరాల్లో భారీ రుణవృద్ధి లక్ష్యంగా వ్యూహాలను ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం బ్యాంక్ సిబ్బంది సంఖ్య 130 వరకూ ఉందనీ, దీనిని మూడు రెట్లు పెంచాలన్నది లక్ష్యమని ఇక్కడ పేర్కొన్నారు. -
13 ప్రభుత్వ బ్యాంకులకు రూ.23,000 కోట్లు
మూలధనాన్నిచ్చి వాటా పెంచుకున్న కేంద్ర ప్రభుత్వం రుణవృద్ధికోసమే ఈ చర్యలు: ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులకు తాజా మూలధనం అందించే దిశగా కేంద్రం మంగళవారం కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) సహా 13 బ్యాంకులకు రూ.22,915 కోట్ల తాజా మూలధనాన్ని కేటాయించింది. రుణాల్లో వృద్ధి రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని, దీన్ని పెంచాలన్న లక్ష్యంతోనే బ్యాంకులకు ఈ నిధులందించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా ఈ నిధులిస్తున్నామని, బ్యాంకింగ్ పనితీరు ప్రాతిపదికన మరిన్ని నిధులు సమకూర్చడం జరుగుతుందని ఒక ప్రకటనలో వివరించింది. తాజా మూలధన కల్పనతో బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా పెరుగుతుంది. తాజా పరిణామంతో బ్యాంకుల షేర్లు 2 నుంచి 5 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. బడ్జెట్లో ప్రకటనలో భాగమే.... గత ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికం ఫలితాల అనంతరం... మొండిబకాయిలు, ఇతర కేటాయింపులకు అనుగుణంగా ప్రతి బ్యాంకూ తనకు కావల్సిన తాజా మూలధనం వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.25,000 కోట్ల తాజా మూలధనాన్ని అందించనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పునర్వ్యస్థీకరణ కోసం ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు నాలుగేళ్లలో రూ.70,000 కోట్ల పెట్టుబడుల్ని ప్రభుత్వం అందిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 25 వేల కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది మరో 25,000 కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో తాజాగా ప్రకటించింది మినహాయిస్తే, మరో మూడు వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. ఇక రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కో ఏడాదికి రూ.10,000 కోట్లు చొప్పున నిధులు అందజేయాలన్నది ప్రణాళిక. అవసరమైతే మరిన్ని నిధులు కూడా అందిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం రుణంలో మొండిబకాయిల పరిమాణం 14% కాగా, ప్రైవేటు బ్యాంకుల్లో ఈ నిష్పత్తి 4.5%.. హర్షణీయం...: ఎస్బీఐ చీఫ్ ‘ప్రభుత్వ తాజా నిర్ణయం హర్షణీయం. తగిన సమయంలో తీసుకున్న ఈ చర్యలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల మెరుగుకు, రుణ వృద్ధికి దోహదపడుతుంది’ అని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. -
రుణ వృద్ధి మందగమనానికి ఎన్పీఏలే కారణం
అధిక వడ్డీరేట్లు కారణం కాదన్న రాజన్ బెంగళూరు: మొండి బకాయిలకు (ఎన్పీఏ) సంబంధించి బ్యాంకింగ్ ఎదుర్కొంటున్న ఒత్తిడే బ్యాంకింగ్ రుణ వృద్ధి మందగమనానికి ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం పేర్కొన్నారు. రుణ వృద్ధి మందగమనానికి అధిక వడ్డీరేట్ల వ్యవస్థ కారణమన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ‘బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల సమస్య పరిష్కారం’ అనే అంశంపై పారిశ్రామిక సంస్థ- అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజన్ మాట్లాడారు. వడ్డీరేట్లు తగ్గిస్తే... రుణ వృద్ధి బాగుంటుందని భావించడం సరికాదని పేర్కొన్నారు. ఎన్పీఏల సమస్య ఉన్నప్పటికీ పరిశ్రమలకు ప్రత్యేకించి మౌలిక రంగానికి బ్యాంకింగ్ తగిన రుణ అవసరాలను తీర్చాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కారమయితే.. అది వడ్డీరేట్ల తగ్గింపునకూ దోహదపడుతుందని వివరించారు. 2015-16లో రుణ వృద్ధి రేటు ఆరు సంవత్సరాల కనిష్ట స్థాయిలో 8.6%కి తగ్గిన సంగతి తెలిసిందే. ఇదే సంవత్సరంలో మొండి బకాయిలు రూ.8 లక్షల కోట్లకు చేరాయి. సెప్టెంబర్ 2013లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక రాజన్ మెల్లగా రెపో రేటును 7.25 % నుంచి 8%కి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. అటు తర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం వంటి అంశాల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50% తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5%కి దిగివచ్చింది. బ్యాంకింగ్ మూలధనానికి ఆర్బీఐ మిగులు నిధులు సరికాదు కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన కల్పనకు ఆర్బీఐ మిగులు నిధులు సమకూర్చాలని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం రూపొందించిన ఆర్థిక సర్వే చేసిన సూచనలను రాజన్ తోసిపుచ్చారు. ఇది తగిన ఆలోచన కాదని, పరస్పర ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తుందన్నారు. అయితే వీలయినంత ఎక్కువ డివిడెండ్‌ను ఆర్బీఐ ప్రభుత్వానికి చెల్లిస్తే.. తద్వారా ప్రభుత్వం బ్యాంకింగ్‌కు తగిన మూలధనం సమకూర్చగలుతుందనీ వ్యాఖ్యానించారు. అంతేగానీ ఆర్బీఐ తనకుతానుగా ప్రత్యక్షంగా బ్యాంకింగ్‌కు నిధుల సమకూర్చడం సరైన ఆలోచన కాదని వివరించారు. 2010-11లో ఆర్బీఐ రూ.15,009 కోట్ల మిగులును కేంద్రానికి బదలాయించింది. 2014-15కి ఇది రూ.65,896 కోట్లకు పెరిగింది. మోసాలపై నిఘా..: ఉద్దేశపూర్వక ఎగవేతదారులను గుర్తించేందుకు, బ్యాంకింగ్ మోసాల నివారణకు, ఆయా సమాచారాన్ని విచారణా సంస్థలకు అందించేందుకు ఒక కమిటీని ఆర్బీఐ ఏర్పాటు చేసినట్లు రాజన్ తెలిపారు. తప్పు చేసిన వారు ఎవ్వరూ తప్పించుకోలేరని అన్నారు. జాబితా నుంచి నన్ను తీసేయవద్దు..: తాను పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకున్నానన్న ధోరణిలో కొందరు రాస్తున్న వ్యాసాలను గత కొద్ది రోజులుగా చూస్తున్నానని రాజన్ చేసిన వ్యాఖ్యలు సమావేశంలో నవ్వులు పూయిం చాయి. సెంట్రల్ బ్యాంక్ నుంచి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా పలు అంశాలపై దేశంతో తన అనుబంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘‘ఇంకా నేను బాధ్యతల్లోనే కొనసాగుతున్నాను. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఉంటాను. బహుశా భారత్‌లోనే ఎక్కువ కాలం గడపొచ్చు. కనుక నన్ను జాబితాలోనుంచి తీసేయకండి’’ అని రాజన్ నవ్వుతూ అన్నారు. -
ఈ ఏడాది రుణ వృద్ధి జోరు లేనట్లే!
- ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయం - జనవరి నుంచీ పరిస్థితి మారుతుందని అంచనా - మదుపరులు బ్యాంకింగ్యేతర పెట్టుబడి మార్గాలనూ చూడాలి... ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్ వరకూ బ్యాంకింగ్ వ్యవస్థలో రుణ వృద్ధి ఊపందుకోకపోవచ్చునని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అయితే మార్చి క్వార్టర్లో అంటే 2016 జనవరి నుంచీ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని ఆమె అంచనావేశారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్ ద్వారా ఈక్విటీల్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అరుంధతీ భట్టాచార్య... ఈ సందర్భంగా విలేకరులతో రుణ వృద్ధి తీరుపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... - బ్యాంక్ డిపాజిట్లు కాకుండా ఇతర ఇన్వెస్ట్మెంట్ విధానాలపై కూడా మదుపరులు దృష్టి పెట్టాలి. బ్యాంకులే కాకుండా... ఇతర ఇన్వెస్ట్మెంట్ విధానాలు కూడా సురక్షితమేనన్న విషయాన్ని మదుపరులు గుర్తించాలి. - తమ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని గరిష్టస్థాయిలో భావించడం జరుగుతుంది. అయితే కేపిటల్ మార్కెట్‌ను ఏ విధంగా విశ్వసనీయతలోకి తీసుకోవాలన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ వేగవంతమైన నిర్ణయాలు అవసరం. అయితే ఇలా మదుపరి చేయలేకపోతే- మ్యూచువల్ పండ్స్లు పెట్టుబడులు పెట్టవచ్చు. - రానున్న కాలంలో అటు డిపాజిట్ రేట్లు, ఇటు రుణ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. - మొండిబకాయిలకు సంబంధించి ఒత్తిడి కొంతమేర సడలింది. జూన్ రుణ వృద్ధి తీరు ఇదీ... ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... జూన్‌లో ఆహారేతర రుణ వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంది. 2015 ఇదే నెలలో ఈ రేటు 13 శాతం. ఈ ఏడాది మేలో సైతం 9 శాతంగా ఉంది. ఇక పరిశ్రమల విషయానికి వస్తే... జూన్‌లో రుణ వృద్ధి రేటు 4.1 శాతానికి పరిమితమైంది. 2014 జూన్‌లో ఈ రేటు 10.2 శాతం. పరిశ్రమకు సంబంధించి అన్ని ప్రధాన ఉప విభాగాల్లో రుణాల్లో అసలు వృద్ధిలేకపోగా, క్షీణ పరిస్థితి నెలకొంది. సేవల విభాగానికి వస్తే... జూన్‌లో వార్షికంగా రుణ వృద్ధి రేటు 13.6 శాతం నుంచి 6 శాతానికి పడిపోయింది. -
8,000 దిగువకు నిఫ్టీ
వర్షాభావ భయాలతో మార్కెట్ కుదేల్ ♦ 470 పాయింట్ల నష్టంతో 26,371కు సెన్సెక్స్ ♦ నిఫ్టీకి 159 మైనస్... సాధారణం కంటే తక్కువగానే వర్షాలు కురుస్తాయన్న ఆందోళనలు గురువారం స్టాక్‌మార్కెట్‌పై పిడుగులు కురిపించాయి. దీనికి తోడు రుణ వృద్ధి మందగమనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 470 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 8,000 పాయింట్ల దిగువకు వచ్చేసింది. కరంట్ అకౌంట్ లోటు తగ్గడం, సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు. వీటిని వేటినీ ఇన్వెస్టర్లు పట్టించుకోలేదు.శుక్రవారం విడుదల కానున్న ఏప్రిల్ నెల పారిశ్రామికోత్పత్తి, మే నెల వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టిపెట్టిన ట్రేడర్లు తమ పొజిషన్లను తగ్గించుకుంటున్నారని విశ్లేషకులంటున్నారు. మొత్తం మీద సెన్సెక్స్ 470 పాయింట్లు నష్టపోయి 26,371 పాయింట్ల వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయి 7,965 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు గత ఏడాది అక్టోబర్ తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. బ్యాంక్, ఆర్థిక సేవలు, వాహన, విద్యుత్ రంగ కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలపాలయ్యాయి. బ్యాంక్ షేర్లు బేర్ ... ప్రభుత్వ రంగ బ్యాంకులకు బడ్జెట్లో కేటాయించినదాని కంటే మరిన్ని పెట్టుబడులు కావాలంటూ ఆర్బీఐ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాయడంతో బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. ఆర్థికమంత్రి జైట్లీ శుక్రవారం పీఎస్ బ్యాంకు చీఫ్‌లతో భేటీ కానున్నారు. 30 సెన్సెక్స్ షేర్లలో 29కి నష్టాలే: వేదాంతా మినహా 30 సెన్సెక్స్ షేర్లలో 29 షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,508 కోట్లు. ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,406 కోట్లు. డెరివేటివ్స్ విభాగంలో రూ.2,80,050 కోట్లుగా నమోదైంది. నిఫ్టీ టార్గెట్‌ను సవరించిన యూబీఎస్ ఈ ఏడాది చివరికల్లా నిఫ్టీ టార్గెట్‌ను స్విట్జర్లాండ్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సవరించింది. ఈ టార్గెట్‌ను గత 9,200 నుంచి వర్షాభావ అంచనాల వల్ల ప్రస్తుతం 8,600కు తగ్గిస్తున్నామని తెలిపింది. మూడు నెలల్లో 12 శాతం పతనం సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత 27,000 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. లాభాల స్వీకరణ కారణంగా 26,349 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 470 పాయింట్లు(1.75 శాతం) నష్టంతో 26,371 పాయింట్ల వద్ద ముగిసింది. 7,958-8,163 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడిన నిఫ్టీ చివరకు 159 పాయింట్ల (1.96 శాతం)నష్టంతో 7,965 పాయింట్ల వద్ద ముగి సింది. ఈ ఏడాది మార్చి 4న సెన్సెక్స్ 30,025, నిఫ్టీ 9,119 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అప్పటి నుంచి చూస్తే కేవలం మూడు నెలల్లో సెన్సెక్స్ 12.2 శాతం, నిఫ్టీ 12.7 శాతం చొప్పున పతనమయ్యాయి.