
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు ఎనిమిది శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అసోచామ్ అధ్యయనం ఒకటి పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం, ఇప్పటికే మొండి బకాయిల సమస్యతో సతమతం అవుతున్న బ్యాంకింగ్ వంటి అంశాలు రుణ వృద్ధి మందగమనానికి ప్రధాన కారణంగా విశ్లేషించింది.
2017 మా ర్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆహారేతర వి భాగ రుణ వృద్ధి కేవలం 5.1 శాతం. ఇది 50 సంవత్సరాల కనిష్టస్థాయి. అయితే తాజా అధ్యయనం ప్రకారం– ఈ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొంత మెరుగుపడుతుండడం కొంత ఆశావహ పరిణామం. రిటైల్, వ్యవసాయ రంగాల నుంచి రుణ డిమాండ్ కొంత మెరుగుపడుతుండడం దీనికి కారణం.