ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ ఖారా అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆరి్థక వృద్ధి రేటును బట్టి చూస్తే ఈ ఆరి్థక సంవత్సరంలో (2024–25) రుణాల వృద్ధి 14–15 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. ‘సాధారణంగా జీడీపీ వృద్ధి రేటుకు ద్రవ్యోల్బణాన్ని కలిపి, దానికి 2–3 శాతం అదనంగా రుణ వృద్ధి ఉండగలదని అంచనా వేస్తుంటాం.
దానికి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలను బట్టి ఇది 14–15 శాతం ఉండొచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇక డిపాజిట్ల విషయానికొస్తే గతేడాది 11 శాతం వృద్ధి నమోదైనట్లు చెప్పారు. ఈసారి 12–13 శాతం స్థాయిలో ఉండగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ చట్టబద్ధ లిక్విడిటీ నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్) నిర్దేశిత స్థాయికన్నా అధికంగానే ఉన్నందున డిపాజిట్ల రేట్లను పెంచి మరీ నిధులు సమీకరించాల్సిన ఒత్తిళ్లేమీ లేవని ఖారా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment