న్యూఢిల్లీ: రాబోయే పూర్తి స్థాయి బడ్జెట్‌లో వడ్డీ ఆదాయంపై పన్నుపరంగా ఊరటనివ్వాలని కేంద్రానికి ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా చర్య తీసుకుంటే డిపాజిటర్లకు ప్రోత్సాహకంగా ఉండి పొదుపు పెరుగుతుందని, అలా వచ్చే నిధులను దీర్ఘకాలిక మౌలిక రంగ ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకునేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఒక ఏడాదిలో ఒక వ్యక్తికి సంబంధించి అన్ని శాఖల్లో ఉన్న డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ. 40,000 దాటితే బ్యాంకులు ట్యాక్స్‌ను డిడక్ట్ చేయాల్సి ఉంటోంది. అదే, సేవింగ్స్ అకౌంట్లయితే రూ. 10,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment