State Bank of India Chairperson
-
వడ్డీ ఆదాయంపై పన్ను ఊరటనివ్వాలి: దినేశ్ ఖారా
న్యూఢిల్లీ: రాబోయే పూర్తి స్థాయి బడ్జెట్లో వడ్డీ ఆదాయంపై పన్నుపరంగా ఊరటనివ్వాలని కేంద్రానికి ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా చర్య తీసుకుంటే డిపాజిటర్లకు ప్రోత్సాహకంగా ఉండి పొదుపు పెరుగుతుందని, అలా వచ్చే నిధులను దీర్ఘకాలిక మౌలిక రంగ ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకునేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఏడాదిలో ఒక వ్యక్తికి సంబంధించి అన్ని శాఖల్లో ఉన్న డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ. 40,000 దాటితే బ్యాంకులు ట్యాక్స్‌ను డిడక్ట్ చేయాల్సి ఉంటోంది. అదే, సేవింగ్స్ అకౌంట్లయితే రూ. 10,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటోంది. -
ఈసారి 15 శాతం రుణ వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆరి్థక వృద్ధి రేటును బట్టి చూస్తే ఈ ఆరి్థక సంవత్సరంలో (2024–25) రుణాల వృద్ధి 14–15 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. ‘సాధారణంగా జీడీపీ వృద్ధి రేటుకు ద్రవ్యోల్బణాన్ని కలిపి, దానికి 2–3 శాతం అదనంగా రుణ వృద్ధి ఉండగలదని అంచనా వేస్తుంటాం. దానికి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలను బట్టి ఇది 14–15 శాతం ఉండొచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇక డిపాజిట్ల విషయానికొస్తే గతేడాది 11 శాతం వృద్ధి నమోదైనట్లు చెప్పారు. ఈసారి 12–13 శాతం స్థాయిలో ఉండగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ చట్టబద్ధ లిక్విడిటీ నిష్పత్తి (ఎస్ఎల్ఆర్) నిర్దేశిత స్థాయికన్నా అధికంగానే ఉన్నందున డిపాజిట్ల రేట్లను పెంచి మరీ నిధులు సమీకరించాల్సిన ఒత్తిళ్లేమీ లేవని ఖారా వివరించారు. -
రుణ డిమాండ్ పెరిగితేనే వడ్డీ రేట్లు తగ్గుతాయ్
ముంబై: రుణాలకు డిమాండ్ పెరిగితేనే వడ్డీ రేట్లు మరింత తగ్గించే అవకాశం ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. రుణాలకు పెద్దగా డిమాండ్ లేనప్పుడు వడ్డీ రేట్లను ఎకాయెకీన తగ్గించేస్తే బ్యాంకులకు వచ్చే ఆదాయమూ తగ్గిపోతుందని ఆమె చెప్పారు. అలాంటప్పుడు డిపాజిట్లపై అధిక వడ్డీని చెల్లించగలిగేందుకు సరిపడేంత ఆదాయాన్ని పొందేందుకు ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తుందన్నారు. అదే భారీ ఎత్తున రుణాలకు డిమాండ్ పెరిగితే, వడ్డీ ఆదాయ పరిమాణమూ పెరుగుతుంది కనుక దాని ఆధారంగా రేట్లను తగ్గించే అవకాశాలు ఉంటాయని అరుంధతి వివరించారు. తయారీ రంగ పురోగతిని సూచించే ఎస్బీఐ కాంపోజిట్ ఇండెక్స్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. డిపాజిట్ రేట్లు అధిక స్థాయిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం బ్యాంకులకు కష్టతరమవుతుందన్నారు. మరోవైపు సమస్యల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్న స్పైస్‌జెట్ విమానయాన సంస్థకు తామెటువంటి రుణాలు ఇవ్వలేదని ఆమె చెప్పారు.