interest income
-
వడ్డీ ఆదాయంపై పన్ను ఊరటనివ్వాలి: దినేశ్ ఖారా
న్యూఢిల్లీ: రాబోయే పూర్తి స్థాయి బడ్జెట్లో వడ్డీ ఆదాయంపై పన్నుపరంగా ఊరటనివ్వాలని కేంద్రానికి ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా చర్య తీసుకుంటే డిపాజిటర్లకు ప్రోత్సాహకంగా ఉండి పొదుపు పెరుగుతుందని, అలా వచ్చే నిధులను దీర్ఘకాలిక మౌలిక రంగ ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకునేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఏడాదిలో ఒక వ్యక్తికి సంబంధించి అన్ని శాఖల్లో ఉన్న డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ. 40,000 దాటితే బ్యాంకులు ట్యాక్స్‌ను డిడక్ట్ చేయాల్సి ఉంటోంది. అదే, సేవింగ్స్ అకౌంట్లయితే రూ. 10,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటోంది. -
Mahila Samman Scheme: గుడ్‌న్యూస్: మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు 2023–24 బడ్జెట్లో మహిళా సమ్మాన్ (Mahila Samman Scheme) పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5 శాతం. రెండేళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్‌ను తీసుకొచ్చింది. అయితే ఇందులో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తాజాగా స్పష్టం చేసింది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! అదే సమయంలో రాబడిపై టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) అమలు చేయరని పేర్కొంది. సీబీడీటీ ఆదేశాల ప్రకారం మహిళా సమ్మాన్ సర్టిఫికెట్లో వచ్చే వడ్డీ ఆదాయం రూ.40వేలు మించకపోతే టీడీఎస్ వర్తించదని స్పష్టమవుతోందని నాంజియా అండర్సన్ ఇండియా పార్ట్నర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై ఒక ఏడాదిలో 7.5 శాతం మేరకు రాబడి రూ.15,000గానే ఉంటుందని, కనుక టీడీఎస్ వర్తించదన్నారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
టీడీఎస్ కోత వద్దా అయితే 'ఫామ్' ఇవ్వండి!
పొదుపు చేసేవారిలో చాలా మంది ఆధారపడేది బ్యాంకు డిపాజిట్లపైనే. రూ.లక్షల కొద్దీ డిపాజిట్ చేసిన వారి వార్షిక వడ్డీ ఆదాయంపై బ్యాంకులు టీడీఎస్ విధిస్తుంటాయి. ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు అందజేస్తాయి. కొందరికి పన్ను చెల్లించేంత ఆదాయం లేకున్నా వడ్డీ రూ.10వేలు దాటితే పడుతుంటుంది. ఇలాంటి వారు సకాలంలో బ్యాంకులకు ఫామ్ 15జీ, 15 హెచ్ ఇవ్వడం ద్వారా పన్ను కోత (టీడీఎస్) బాధను తప్పించుకోవచ్చు. అప్పుడు బ్యాంకులు వడ్డీలో రూపాయి కూడా కోత పెట్టవు. ఆ వివరాలు చూద్దాం... టీడీఎస్ అన్నది ఎంత మొత్తం డిపాజిట్ చేశారన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే వార్షికంగా వడ్డీ ఆదాయం రూ.10,000 దాటిన వారికి టీడీఎస్ భారం ఉంటుంది. సీనియర్ సిటిజన్లు (60ఏళ్లు దాటిన వారు) అయితే వడ్డీ ఆదాయం రూ.50,000 వరకు టీడీఎస్ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అమలవుతుంది. చెల్లించాల్సిన వడ్డీలో 10 శాతాన్ని పన్ను కింద బ్యాంకులు మినహాయించి మిగిలిన మొత్తాన్నే ఖాతాదార్లకు చెల్లిస్తాయి. పన్ను కట్టేంత ఆదాయం లేకుంటే... ఒక ఉదాహరణ చూద్దాం. రాజారావుకు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రూపంలో ఏడాదికి రూ.2 లక్షల వరకూ వస్తుంది. తనకు ఇతరత్రా ఆదాయమేదీ లేదు. అలాగే శ్రీకర్‌కు జీతం రూపంలో వార్షికంగా రూ.10 లక్షల వరకూ వస్తుంది. అది కాకుండా బ్యాంకులోని డిపాజిట్లపై ఏడాదికి రూ.9 వేల వరకూ ఆదాయం వస్తుంది. ఆదాయపు పన్ను లెక్కల ప్రకారం శ్రీకర్ తన జీతానికి ఈ వడ్డీని కలిపి మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే తను ఎక్కువ పన్ను చెల్లించాలి. రాజారావుకు ఇతరత్రా ఆదాయమేదీ లేదు కనుక రూ.2 లక్షలు దాదాపు పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటుంది. కానీ ఇక్కడ బ్యాంకులు ఏం చేస్తాయంటే రాజారావు వడ్డీపై రూ.20వేలు ఆదాయపు పన్ను కింద మినహాయిస్తాయి. శ్రీకర్ విషయంలో మాత్రం రూపాయి కూడా కోత కోయవు. ఎందుకంటే వాటికి వడ్డీ ఆదాయం ఎంతన్నదే ముఖ్యం. డిపాజిట్ చేసిన వారి వ్యక్తిగత ఆదాయంతో సంబంధం ఉండదు. అందుకే రాజారావు వంటి వ్యక్తులు బ్యాంకుకు ఫామ్ 15జీ, 15హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు బ్యాంకులు వారి వడ్డీలో కోత పెట్టవు. వారి ఆదాయం పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటుంది కనుక వారు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.శ్రీకర్లా బయట జీతం, ఇతరత్రా ఆదాయం వస్తూ... అది పన్ను మినహాయింపు పరిధిని దాటిపోయిన పక్షంలో వారు బ్యాంకుల్లో ఫామ్ 15జీ, 15హెచ్ వంటివి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వారికి పన్ను రూపేణా 10 శాతం కోత పడి, మిగిలింది మాత్రమే చేతికి వస్తుంది. ఒకవేళ వారు సైతం ఫామ్ 15 సమర్పించి ఉంటే... బ్యాంకులు వారికి మొత్తం వడ్డీని ఇచ్చేస్తాయి. కానీ వారు తమ ఆదాయానికి దీన్ని కూడా కలిపి, ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎవరు ఏ ఫామ్ ఇవ్వాలంటే... 60 ఏళ్లలోపు వయసున్న వారు టీడీఎస్ వద్దనుకుంటే ఫామ్ 15జీ ఇవ్వాలి. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన వారు దీన్ని ఇచ్చేందుకు అర్హులు. ఒకవేళ సీనియర్ సిటిజన్లయితే ఫామ్ 15హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ రెండూ కూడా మన దేశంలో ఉండేవారికే. ఎన్నారైలు వీటిని సమర్పించేందుకు అవకాశం లేదు. ఫామ్ 15జీ ఇవ్వాలనుకునే వారు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలేమిటంటే... పన్ను మినహాయింపులను తీసివేయగా మిగిలిన ఆదాయం వార్షికంగా రూ.2.5 లక్షలు దాటకూడదు. అలాగే, వడ్డీ ఆదాయం మొత్తం కూడా రూ.2.5 లక్షలు దాటకూడదు. మరో ఉదాహరణ చూద్దాం... శ్రీనాథ్‌కు వార్షికంగా వడ్డీ రూపేణా రూ.2.75 లక్షల ఆదాయం వస్తోంది. ఇది కాక అతని మరో రూ.1.25 లక్షలు ఇతర ఆదాయంగా సమకూరింది. మొత్తంగా ఆ సంవత్సరంలో అతని ఆదాయం రూ.4 లక్షలు. అయితే, శ్రీనాథ్ సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన సాధనాల్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. దీంతో అతడి పన్ను వర్తించే ఆదాయం రూ.2.5 లక్షలయింది. ఇక్కడ శ్రీనాథ్‌కు ఫామ్ 15జీ ఇచ్చేందుకు అర్హత లేదు. పన్ను వర్తించే ఆదాయం రూ.2.5 లక్షలే కానీ... వార్షిక వడ్డీ ఆదాయం రూ.2.5 లక్షలు దాటకూడదన్న నిబంధన అతడి విషయంలో నెరవేరలేదు. వడ్డీ రూపంలో శ్రీనాథ్‌కు రూ.2.75 లక్షలొస్తోంది కనుక ఫామ్ 15జీ ఇవ్వడానికి కుదరదు. అయితే, సీనియర్ సిటిజన్లకు కాస్తంత వెసులుబాటుంది. వారు ఏదో ఒక నిబంధన నెరవేరిస్తే ఫామ్ 15 హెచ్ ఇవ్వొచ్చు. అంటే సీనియర్ సిటిజన్లకు వార్షికాదాయం పన్ను వర్తించేంత ఉండకుండా ఉంటే చాలు. 60–80 ఏళ్ల మధ్య ఉన్న వారికి వార్షికాదాయం రూ.3 లక్షల వరకు, 80 ఏళ్లపైన ఉన్న వారికి రూ.5 లక్షల వరకు పన్ను లేదు. ఈ లోపు వార్షికాదాయం ఉంటే ఫామ్ 15 హెచ్ ఇచ్చేందుకు అర్హత ఉన్నట్టే. వడ్డీ ఆదాయం ఈ వార్షిక ఆదాయ పరిమితి దాటి ఉన్నా ఫర్వాలేదు. బ్యాంకులకే కాదు... టీడీఎస్ విధించకుండా ఇచ్చే ఈ పత్రాలు బ్యాంకులకే పరిమితం అనుకునేరు. బాండ్లను జారీ చేసే కంపెనీలు, ఈపీఎఫ్‌వో, అద్దె ఇంట్లో ఉండి కిరాయి చెల్లించేవారు, కమీషన్ చెల్లించే బీమా సంస్థలకు కూడా వీటిని సమర్పించొచ్చు. ►ఒకే బ్యాంకు పరిధిలో ఒకటికి మించిన బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేసి ఉంటే అన్నింటి వడ్డీ ఆదాయాన్ని లెక్కించి బ్యాంకులు టీడీఎస్‌ను అమలు చేస్తాయి. కనుక డిపాజిట్ ఉన్న ప్రతీ బ్యాంకు శాఖలో వడ్డీ ఆదాయం రూ.10,000 దాటుతున్నట్టయితే ఫామ్ 15జీ, సీనియర్ సిటిజన్లు రూ.50,000 దాటితే ఫామ్15హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ►కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి వార్షిక వడ్డీ ఆదాయం రూ.5,000 దాటితే కంపెనీలు 10 శాతం టీడీఎస్‌ను కోసేస్తాయి. ► ఈపీఎఫ్ సభ్యులు ఐదేళ్ల సర్వీసు పూర్తి కాకుండానే డబ్బుల్ని వెనక్కి తీసుకున్నా 10 శాతం టీడీఎస్ అమలు చేస్తారు. ►కిరాయిదారులు వార్షికంగా అద్దె రూపంలో ఇచ్చే ఆదాయం రూ.1,80,000 దాటితే వారూ అద్దె మొత్తంలో 10 శాతం టీడీఎస్ కింద మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భాల్లో అర్హత కలిగిన వారు ఫామ్ 15జీ లేదా ఫామ్ 15హెచ్ సమర్పించడం ద్వారా పన్ను భారాన్ని తప్పించుకోవచ్చు. ఈ పత్రాల్లో పాన్ నంబర్‌ను పేర్కొనడం తప్పనిసరి. లేదంటే టీడీఎస్ కింద 20 శాతం మినహాయించడం జరుగుతుంది. ప్రస్తుతం బ్యాంకులు వీటిని ఆన్‌లైన్‌లోనూ సమర్పించే అవకాశం కల్పిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరంలో వీటిని ఎప్పుడైనా సమర్పించే వీలుంది. అయితే, పన్ను విధించకుండా వీలైనంత ముందుగానే ఇవ్వడమే మంచిదన్న విషయం గుర్తుంచుకోవాలి. వీటిని ప్రతీ ఆర్థిక సంవత్సరానికి విడిగా ఇవ్వాల్సి ఉంటుంది. -
ఫెడరల్ బ్యాంక్ లాభం రూ. 210 కోట్లు
న్యూఢిల్లీ: పెట్టుబడులపై మంచి రాబడులు, వడ్డీ ఆదాయం పెరుగుదల ఊతంతో ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.210 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 167 కోట్లతో పోలిస్తే ఇది 26 శాతం వృద్ధి. క్యూ1లో బ్యాంకు ఆదాయం రూ. 2,264 కోట్ల నుంచి రూ. 2,653 కోట్లకు పెరిగింది. ఇక, జూన్ త్రైమాసికంలో స్థూల నిరర్ధక ఆస్తులు(జీఎన్‌పీఏ) 2.92% నుంచి 2.42%కి, నికర ఎన్పీఏలు 1.68% నుంచి 1.39%కి తగ్గాయి. బుధవారం బీఎస్ఈలో ఫెడరల్ బ్యాంక్ షేరు సుమారు 4% క్షీణించి రూ. 114.80 వద్ద ముగిసింది. -
కెనరా బ్యాంక్ లాభం 10% అప్
♦ క్యూ1లో రూ.252 కోట్లు ♦ తగ్గిన వడ్డీ ఆదాయం ♦ 7.09 శాతానికి నికర ఎన్పీఏలు న్యూఢిల్లీ: వడ్డీ ఆదాయం తగ్గుదలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభ వృద్ధి 10 శాతానికి పరిమితమైంది. సుమారు రూ. 252 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంకు లాభం దాదాపు రూ. 229 కోట్లు. ఇక తాజాగా ఆదాయం రూ. 11,786 కోట్ల నుంచి రూ. 12,304 కోట్లకు పెరిగింది. మరోవైపు గత క్యూ1లో నమోదైన రూ. 10,202 కోట్లతో పోలిస్తే వడ్డీ ఆదాయం ఈసారి రూ. 10,196 కోట్లకు తగ్గింది. అటు మొత్తం రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 9.71 శాతం నుంచి 10.56 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 6.69 శాతం నుంచి 7.09 శాతానికి చేరాయి. ఫలితంగా మొండిబకాయిలకు చేయాల్సిన ప్రొవిజనింగ్ కూడా పెరిగి రూ. 1,469 కోట్ల నుంచి రూ. 2,270 కోట్లకు ఎగిసింది. బుధవారం బీఎస్ఈలో కెనరా బ్యాంకు షేరు ధర 0.58 శాతం పెరిగి రూ. 371 వద్ద ముగిసింది. -
ఐఎఫ్‌సీఐకు అధిక వడ్డీ ఆదాయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐఎఫ్సీఐ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.102 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో ఆర్జించిన నికర లాభం(రూ.94 కోట్లు)తో పోల్చితే 8 శాతం వృద్ధి సాధించామని ఐఎఫ్సీఐ తెలిపింది. అధిక వడ్డీ ఆదాయం, రుణ నాణ్యత మెరుగుపడడం వల్ల నికర లాభంలో వృద్ధి సాధించామని ఐఎఫ్సీఐ ఎండీ మలయ్ ముఖర్జీ చెప్పారు. గత క్యూ1లో రూ.104 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో రూ.233 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత క్యూ1లో రూ.737 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 24 శాతం వృద్ధితో రూ.914 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు. మొండి బకాయిల కేటాయింపులు రూ.78 కోట్ల నుచి రూ.130 కోట్లకు పెరిగాయని వివరించారు. -
ఆంధ్రా బ్యాంక్ లాభం రెట్టింపు
⇒ రూ. 185 కోట్లకు పెరుగుదల ⇒ తగ్గిన మొండిబకాయిలు... ⇒ బ్యాంక్ సీఎండీ రాజేంద్రన్... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వడ్డీ ఆదాయం పెరగడం, నిరర్థక ఆస్తులు తగ్గడం తదితర అంశాల ఊతంతో 2014-15 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంక్ నికర లాభం 110 శాతం ఎగిసింది. 2013-14 క్యూ4లో రూ. 88 కోట్లు కాగా తాజాగా రూ. 185 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ. 4,058 కోట్ల నుంచి రూ. 4,699 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 44 శాతం పెరిగి రూ. 1,371 కోట్లుగాను నమోదైంది. ఒకవైపు డిపాజిట్ల వ్యయం తగ్గడం, మరోవైపు ఇచ్చిన రుణాలపై వడ్డీ ఆదాయాలు పెరగడం మెరుగైన పనితీరుకు దోహదపడ్డాయని సోమవారం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆంధ్రా బ్యాంక్ సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ తెలిపారు. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.65% నుంచి 3.48%కి పెరిగాయని పేర్కొన్నారు. అలాగే, నికర మొండిబకాయిలు(ఎన్పీఏ) క్రితం త్రైమాసికంతో పోలిస్తే 3.70% నుంచి 2.93 శాతానికి తగ్గాయని రాజేంద్రన్ వివరించారు. రుణాల పునర్వ్యవస్థీకరణకు(సీడీఆర్) సంబంధించి ఎక్కువగా ఇన్ఫ్రా రంగ సంస్థల అకౌంట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. రూ. 3,000 కోట్ల నిధుల సమీకరణ .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మొదటి, ద్వితీయ శ్రేణి క్యాపిటల్ కింద బాండ్ల జారీ ద్వారా సుమారు రూ. 3,000 కోట్లు సమీకరించనున్నట్లు రాజేంద్రన్ చెప్పారు. జాతీయ స్థాయి లో కార్యకలాపాలను మరిం తగా విస్తరిస్తున్నామన్నారు. ప్రస్తుతం 2,507 శాఖలు ఉన్నాయని, మూడేళ్లలో ఈ సంఖ్యను 3,600కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. 2015-16 తొలి త్రైమాసికంలోనే సుమారు 200 శాఖలను ప్రారంభించనున్నట్లు రాజేంద్రన్ తెలి పారు. తెలంగాణలో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించనున్నామని ఆయన వివరించారు. చిన్న సంస్థలకు సులభతరంగా రుణాలిచ్చేలా త్వరలో కరీంనగర్లో ఎస్ఎంఈ ఎక్స్‌ప్రెస్‌ను, అలాగే రిటైల్ రుణాలకు సంబంధించి తిరుపతిలో లోన్ ఎక్స్‌ప్రెస్ సెంటర్‌ను ప్రారంభించే ప్రతిపాదన ఉందన్నారు. రుణమాఫీలో తెలంగాణ గుడ్.. రుణ మాఫీ చెల్లింపుల్లో తెలంగాణ రికార్డు బాగుందని రాజేంద్రన్ తెలిపారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో (ఏపీ) ఇంకా హార్టికల్చర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు సంబంధించి చెల్లింపులు రావాల్సి ఉందని ఆయన చెప్పారు. ఇప్పటిదాకా రుణ మాఫీ విషయంలో రెండు విడతల చెల్లింపులు లభించాయని, కానీ హార్టికల్చర్, స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)కి సంబంధించి ఎలాంటి చెల్లింపులు రాలేదన్నారు. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర బీఎస్ఈలో 1.5% పెరిగి రూ.76 వద్ద స్థిరపడింది. -
70 శాతం తగ్గిన బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 70 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.586 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.173 కోట్లకు తగ్గిందని బ్యాంక్ సీఎండీ విజయలక్ష్మి అయ్యర్ చెప్పారు. కేటాయింపులు అధికంగా ఉండడం, మొండి బకాయిలు పెరగడం, వడ్డీ ఆదాయం స్వల్పంగానే వృద్ది చెందడం వల్ల నికర లాభం భారీగా తగ్గిందని పేర్కొన్నారు. గత క్యూ3లో 2.8 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.07 శాతానికి, నికర మొండి బకాయిలు 1.75 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగాయని వివరించారు. ఆదాయపు పన్ను మినహా కేటాయింపులు రూ.1,404 కోట్ల నుంచి రూ.1,581 కోట్లకు పెరిగాయని, వడ్డీ ఆదాయం రూ.9,769 కోట్ల నుంచి రూ.11,947 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మొండి బకాయిలకు కేటాయింపులు 25 శాతం నుంచి40 శాతానికి పెరిగాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో బ్యాంక్ షేర్ 5.7 శాతం తగ్గి రూ.227 వద్ద ముగిసింది. -
యూనియన్ బ్యాంక్ లాభం 27% డౌన్
క్యూ4లో రూ. 579 కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ జనవరి-మార్చి(క్యూ4)లో రూ. 579 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 789 కోట్లతో పోలిస్తే ఇది 27% క్షీణత. మొండిబకాయిలకు ప్రొవిజన్లు పెరగడం, వడ్డీయేతర ఆదాయం తగ్గడం లాభాలను దెబ్బతీసినట్లు బ్యాంకు చైర్మన్ అరుణ్ తివారీ పేర్కొన్నారు. బకాయిలకు కేటాయింపులు రూ. 655 కోట్ల నుంచి రూ. 920 కోట్లకు పెరిగాయి. వడ్డీయేతర ఆదాయం రూ. 875 కోట్ల నుంచి రూ. 775 కోట్లకు తగ్గింది. నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.61% నుంచి 2.33%కు పెరిగాయి. ఈ కాలంలో రూ. 320 కోట్లమేర మొండి రుణాలను విక్రయించింది. వడ్డీ ఆదాయం 3.6% అప్ క్యూ4లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 3.6% పుంజుకుని రూ. 2,052 కోట్లను తాకగా, నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.62%గా నమోదయ్యాయి. ఇదే కాలానికి బ్యాంకు మొత్తం ఆదాయం కూడా రూ. 7,501 కోట్ల నుంచి రూ. 8,445 కోట్లకు ఎగసింది. ఇక పూర్తి ఏడాదికి(2013-14) బ్యాంకు నికర లాభం 21%పైగా క్షీణించి రూ. 1,696 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంకు షేరు దాదాపు 9% పతనమై రూ. 135 వద్ద ముగిసింది.