ఐఎఫ్‌సీఐకు అధిక వడ్డీ ఆదాయం | IFCI to higher interest income | Sakshi
Sakshi News home page

ఐఎఫ్‌సీఐకు అధిక వడ్డీ ఆదాయం

Published Wed, Aug 12 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

ఐఎఫ్‌సీఐకు అధిక వడ్డీ ఆదాయం

ఐఎఫ్‌సీఐకు అధిక వడ్డీ ఆదాయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐఎఫ్‌సీఐ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.102 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో ఆర్జించిన నికర లాభం(రూ.94 కోట్లు)తో పోల్చితే 8 శాతం వృద్ధి సాధించామని ఐఎఫ్‌సీఐ తెలిపింది.  అధిక వడ్డీ ఆదాయం, రుణ నాణ్యత మెరుగుపడడం వల్ల నికర లాభంలో వృద్ధి సాధించామని ఐఎఫ్‌సీఐ ఎండీ మలయ్ ముఖర్జీ చెప్పారు. గత క్యూ1లో రూ.104 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో రూ.233 కోట్లకు పెరిగిందని తెలిపారు.  గత క్యూ1లో రూ.737 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 24 శాతం వృద్ధితో రూ.914 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు. మొండి బకాయిల కేటాయింపులు రూ.78 కోట్ల నుచి రూ.130 కోట్లకు పెరిగాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement