ముంబై: భారత్‌లో రుణ వృద్ధి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పరిమితం కావచ్చని జపాన్ బ్రోకరేజ్ సంస్థ-నోమురా అంచనా వేసింది. 2022-23లో సాధించిన 15 శాతంతో పోల్చిచూస్తే రుణ స్పీడ్ దాదాపు 5 శాతం పడిపోతు దన్నది నోమురా అంచనాలు కావడం గమనార్హం. ఆహారేతర రుణాలకు సంబంధించి వృద్ధి మందగించే అవకాశం ఉందని ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో సంస్థ అభిప్రాయపడింది.
(ఇదీ చదవండి: బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?)
రుణ వృద్ధి స్పీడ్ తగ్గడంసహా, ద్రవ్యోల్బణం ఒత్తిడులు, తక్కువ మూలధన అవసరాలు వంటి కారణాలు 2023-24లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రేటును 5.3 శాతానికి పరిమితం చేస్తాయని కూడా నోమురా అంచనా వేయడం గమనార్హం. గత ఏడాది మే నుంచి 2.5 శాతం మేర పెరిగిన ఆర్‌బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.5 శాతం) రుణ వృద్ధికి విఘాతం కలిగించే వీలుందని, వ్యవస్థలో ప్రత్యేకించి గృహ రుణాలపై ఇప్పటికే ఈ సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషించింది. (డిజిటల్ బాటలో ఎయిర్ ఇండియా - భారీ పెట్టుబడి)
జనవరిలో 16.7 శాతం రుణ వృద్ధి నమోదయితే.. ఇది తగ్గుతూ వస్తున్న ధోరణి స్పష్టమవుతోందని పేర్కొంది. ఫిబ్రవరిలో 16 శాతం, మార్చిలో 15.4 శాతంగా రుణ వృద్ధి జరిగిందని పేర్కొంది. రానున్న మాసాల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. రుణ వృద్ధి పెంచుకోవవడం-సాధ్యమైనంత మొండిబకాయిలు (ఎన్‌పీఏ) తగ్గించుకోవడంపై భారత్ బ్యాంకింగ్ ప్రస్తుతం దృష్టి సారించినట్లు పరిస్థితి కనబడుతోందని పేర్కొంది. (శ్యామ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్టాల్లో మరింత విస్తరణ)
Comments
Please login to add a commentAdd a comment